class 10 student gangraped in kanpur of uttar pradesh village

Minor student gang raped in uttar pradesh village

rape, minor raped, minor girl Gang rape, kanpur gangrape, uttar pradesh, woman raped, Woman Gang rape, molestation on women, attrocities on women, harrassment on women,

A minor girl studing class X was reportedly gangraped by her neighbour and his friends from uttar pradesh village police said.

యూపీలో దారునం.. పదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

Posted: 03/26/2016 07:42 PM IST
Minor student gang raped in uttar pradesh village

ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా దారుణం జరిగింది, జిల్లాలోని కకాదేవ్ ప్రాంతంలో పనిపై వెళ్లిన పదో తరగతి విద్యార్థిని (16)పై ఐదుగురు మదమృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం రాత్రి ఈ అమ్మాయి ఇంట్లో నుంచి పనిమీద బయటకు వెళ్లింది. ఇంటి పక్కన ఉండే గొలు అనే యువకుడు ఆ సమయంలో మరో నలుగురు యువకులతో కలసి బాలికను తన ఇంట్లోకి బలవంతంగా లాక్కెళ్లాడు. ఆమెకు మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డారు.

బాలిక ఇంటికి రాకపోయేసరికి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె సెల్ఫోన్కు ఫోన్ చేయగా బదులు ఇవ్వలేదు. కాగా ఫోన్ రింగ్ టోన్ సౌండ్ పక్క ఇంటి నుంచి వస్తున్నట్టు గుర్తించారు. గొలు ఇంట్లోకి వెళ్లి చూడగా బాధితురాలు అపస్మారక స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. గొలుతో పాటు చింటు, ఛోటు, ఆకాశ్, శుభమ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు చెప్పింది. కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారు.  

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  minor raped  minor girl Gang rape  kanpur gangrape  uttar pradesh  

Other Articles