Go to Pakistan’, Shiv Sena responded to Owaisi comment

Go to pakistan shiv sena responded to owaisi comment

Shiv Sena, Asaduddin Owaisi, Ramdas Kadam

AIMIM President, Asaduddin Owaisi should be sent to Pakistan for refusing to chant ‘Bharat mata ki jai’, said Shiv Sena yesterday. The demand was raised by Sena minister Ramdas Kadam yesterday, on the sidelines of the Budget Session of the state legislature.

అసదుద్దీన్ ఓవైసీ పాకిస్థాన్ వెళ్లాలి

Posted: 03/15/2016 02:01 PM IST
Go to pakistan shiv sena responded to owaisi comment

ఏఐఎంఐఎం పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ నిన్న మహారాష్ట్రలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తాను భారత్ మాత్ కు జై అని అనను గాక అనను.. చివరకు నా గొంతు మీద కత్తి పెట్టినా కూడా భారత్ మాతకు జై అని అనబోనని ఓవైసీ తెలిపారు. అయితే దీని మీద శివసేన ఘాటుగా స్పందించింది. భారత్ లో నివసిస్తు, బారత్ మాతకు జై అని అనకపోతే దేశం వదిలివెళ్లాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ కు వెళ్లాలని సూచించారు. అలాగే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా దీని మీద స్పందించారు. భారత్ మాతకు జై అని అనడానికి కూడా చట్టాలు తీసుకురావాలా అని ప్రశ్నించారు. అయితే ఓవైసీ అలా వ్యాఖ్యలు చెయ్యడం తగదని అన్నారు. కాగా అలా వ్యాఖ్యలు చేసినా కూడా కొన్ని పార్టీలు వంతపాడటం సరికాదని అన్నారు.

మరోపక్క ఓవైసీ మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమయ్యాయి. అసదుద్దీన్ ఓవైసీ క్షమాపణలు చెప్పాలని సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాగా కొన్ని చోట్ల అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యల మీద కోర్టులో కేసులు కూడా నమోదయ్యాయి. కాగా దీని మీద స్పందిస్తూ.. తనకు కోర్టుల మీద పూర్తి నమ్మకం ఉందని.. తనకు న్యాయమే జరుగుతుందని అన్నారు. కాగా చివర్లో మాత్రం జైహింద్ అంటూ తన స్టేట్ మెంట్ ను ముగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shiv Sena  Asaduddin Owaisi  Ramdas Kadam  

Other Articles

Today on Telugu Wishesh