Bhuma Nagi Reddy between the TDP and YSRCP

Bhuma nagi reddy between the tdp and ysrcp

YSRCP, TDP, Bhuma Nagi Reddy, Kurnool

YSRCP leader Bhuma Nagi Reddy may join into TDP. Jagan conduct emergency meeting in Lotuspond.

టిడిపి, వైసీపీ మధ్యలో భూమా నాగిరెడ్డి

Posted: 02/20/2016 03:56 PM IST
Bhuma nagi reddy between the tdp and ysrcp

వైసీసీ నాయకుడు భూమా నాగిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్న వార్త రాజకీయరంగంలో వేడినిపుట్టిచ్చింది. కర్నూల్ జిల్లా నాయకులతో వైపీసీ అధినేత జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో అత్యవసర భేటీ నిర్వహించారు. పిఎసి చైర్మెన్ గా భూమా నాగారెడ్డిని నియమించామని... అలాగే పార్టీలో భూమాకు ఎంతో ప్రాధాన్యతనిచ్చామని కానీ అయినా కూడా పార్టీ వీడాలని అనుకోవడం పద్దతికాదు అని కర్నూల్ జిల్లా నేతలతో జగన్ అన్నట్లు తెలిసింది.

భూమా నాగిరెడ్డితో పాటుగా మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారన్న వార్తతో జగన్ కర్నూల్ జిల్లా నేతలతో కీలక, అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సుబ్బారెడ్డి, సజ్జలతో భూమాను బుజ్జిగించేందుకు జగన్ విశ్వప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. కాగా భూమా నాగిరెడ్డి పార్టీ మారడం దాదాపు ఖరారైందని అందుకే మిగిలిన నాయకులను కాపాడుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  TDP  Bhuma Nagi Reddy  Kurnool  

Other Articles