TRS fix its victory in Hyderabad

Trs fix its victory in hyderabad

KTR, CM Kcr, GHMC Election Results, Hyderabad TDP, Congress

TRS bags maximum seats in the GHMC elections. TRS gain triple digit majority

హైదరాబాద్ లో జెండా పాతిన టిఆర్ఎస్

Posted: 02/05/2016 07:20 PM IST
Trs fix its victory in hyderabad

హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ జెండా పాతింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ దూసుకెళ్లింది. అన్ని పార్టీలకు చుక్కలు చూపిస్తూ గులాబీ దళం దూసుకెళ్లింది. భాగ్యనగరం ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోయింది. టీఆర్ఎస్ ఇప్పడి వరకు గ్రామాల్లో , జిల్లాల్లో మాత్రమే ఉంది అన్న విషయాన్ని ఈ ఎన్నికలతో హైదరాబాదులోను గులాబీ సేన సత్తా చాటింది . సెటిలర్స్ ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లో టీఆర్ఎస్ కు బలం లేదని ఇప్పడి వరకు ఉన్నప్పటికీ ఆయా డివిజన్ల లో టిఆర్ఎస్ స్థానాలను కైవసం చేసుకోవడం పట్ల విశ్లేషకులు సైతం ఆశ్చర్య పోతున్నారు . ఒకప్పుడు పోటీ చేయడానికే ముందుకు రాని టిఆర్ఎస్ పార్టీ ఈరోజు మేయర్ పీఠాన్ని దక్కించుకునే స్థాయికి చేరిందంటే నమ్మలేకపోతున్నారు . మొత్తం 150 స్థానాలున్న గ్రేటర్ ఎన్నికల్లో దాదాపు వంద సీట్ల లో ఆధిక్యం దిశగా దూసుకు పోతోంది టిఆర్ఎస్ . మొత్తానికి కేటిఆర్ అంతా నేనే అయి గ్రేటర్ ఎన్నికల్లో నడిపించాడు .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR  CM Kcr  GHMC Election Results  Hyderabad TDP  Congress  

Other Articles