తమిళనాడులో వివాదాస్పద జల్లికట్టు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే రానున్న ఎన్నికల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా మరో సారి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మీద స్పందించింది. కేంద్రం జల్లికట్టు ఆడేందుకు ఇచ్చిన అనుమతుల మీద స్టే విధిస్తూ సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులో ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ రోజున నిర్వహించే జల్లికట్టుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జల్లికట్టు నిర్వహణకు కేంద్రం ఇచ్చిన అనుమతులపై కోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జల్లికట్టుపై కేంద్రం అనుమతులు నిలిపివేయాలని జంతు సంరక్షణ బోర్డు, పెటా సంస్థలు నిన్న పిటిషన్ దాఖలు చేశాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను స్వీకరించి ఇవాళ విచారణ చేపట్టింది. 2014లో సుప్రీం తీర్పునకు కేంద్రం నోటిఫికేషన్ విరుద్ధంగా ఉందని పిటిషన్లో తెలిపింది. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని జల్లికట్టు అతిక్రమిస్తుందని పిటిషనర్లు వాదించారు. అయితే జల్లికట్టు ఎంతో కాలంగా సంప్రదాయంగా కొనసాగుతోందని తమిళులు వాదిస్తున్నారు. కానీ మరోసారి కేంద్రం అనుమతినిస్తూ తీసుకున్న నిర్ణయంతో జల్లికట్టు వివాదం తెర మీదకు వచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more