American presidential candidate Donald Trump over action

American presidential candidate donald trump over action

donald Trump, America, Muslims, Rose Hamid

American presidential candidate Donald Trump over action. Rose Hamid, 56, was kicked out of Donald Trump's event. The Muslim woman who was removed from Donald Trump's campaign event in South Carolina on Friday after standing in silent protest following one of the Republican front-runner's controversial immigration comments says her reason for doing so was to show people that 'Muslims are not that scary.'

డొనాల్డ్ ట్రంప్ కండకావరం

Posted: 01/11/2016 11:47 AM IST
American presidential candidate donald trump over action

అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ చేష్టలు మరీ మితిమీరుతున్నాయి. ఇప్పటికే ముస్లింల మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. దక్షిణ కరోలినాలోని విన్‌థ్రోప్‌ యూనివర్శిటీలో ఓ ర్యాలీ జరిగింది. అమెరికా అధ్యక్ష పదవిపై కన్నేసిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌ వేదికపైకొచ్చి ప్రసంగం అందుకున్నాడు. కాగా ముస్లిమ్స్‌ను వ్యతిరేకిస్తూ అతను గతంలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రోసే హమీద్ అనే మహిళ మరికొందరు లేని నిల్చున్నారు. ఐ కమ్‌ ఇన్ పీస్ అని రాసి ఉన్న టీ షర్ట్‌, ముస్లిమ్స్‌ అనే బ్యాడ్జీ ధరించింది. వాళ్లు ఏ ఆందోళనా చేయకుండా శాంతియుతంగా నిలుచుని ఉన్నారు. ఇది గమనించిన ట్రంప్‌... పోలీసుల చేత వారిని గెంటేయించారు. పైగా వారు నీ వద్ద బాంబు ఉంది కదా అందా గద్దిస్తూ బయటకు వెళ్లగొట్టారు. దీనిపై ద కౌన్సిల్‌ ఆఫ్‌ అమెరికా-ఇస్లామిక్ రిలేషన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డొనాల్డ్‌ ట్రంప్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

కొద్ది రోజుల క్రితం ముస్లిమ్స్‌ ప్రమాదకరమైనవారు.. వాళ్లు మంచోళ్లో కాదో ఒక స్పష్టత వచ్చాకే అమెరికాలోకి రానివ్వాలంటూ కామెంట్స్‌ చేసి అందరిచేతా అక్షింతలు వేయించుకున్నాడు. ట్రంప్ నీకేమైనా మతి చెడిందా అంటూ అమెరికా యూత్‌ ఫైరైంది. తాజాగా అలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా తన తోక వంకరే అని నిరూపించుకున్నాడు ట్రంప్. అయితే డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు అక్కడి వారిలో విద్వేషాలు రెచ్చగొడుతున్నా కానీ అక్కడ పాపులర్ అవుతున్న అధ్యక్ష అభ్యర్థుల్లో డొనాల్డ్ ముందున్నారు. అలాగే ఆయనకు ఆదరణ ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : donald Trump  America  Muslims  Rose Hamid  

Other Articles