Amitabh replaces Aamir as Incredible India ambassador

Amitabh replaces aamir as incredible india ambassador

Amitabh Bachchan, Aamir Khan, Incredible India, the Tourism Ministry of India, Atithi Devo Bhava' campaign, Intolerance

Amitabh Bachchan is all set to replace Aamir Khan as the brand ambassador of Incredible India campaign run by the Tourism Ministry of India. What most people do not know about how the functioning of this campaign is that the Ministry did not hire Aamir Khan for the 'Atithi Devo Bhava' campaign.

అమీర్ స్థానంలో అమితాబ్

Posted: 01/08/2016 10:55 AM IST
Amitabh replaces aamir as incredible india ambassador

దేశంలో అసహనం పెరిగిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర దుమారానికి తెర తీసిన బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇంక్రిడిబుల్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా అతడు చేసిన వ్యాఖ్యల కారణంగా... ఆయన కాంట్రాక్ట్ ముగియనుండటంతో అమీర్ ను తప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్ నియామకానికి రంగం సిద్ధమైంది. త్వరలో అమితాబ్ నియామకంపై ప్రకటన వెలువడనుంది. అమితాబ్‌ ఎంపిక దాదాపు ఖరారైంది.

అసహనం మీద ఆమీర్ వ్యాఖ్యలను కేంద్రమంత్రులతో పాటు, బీజేపీ నేతలు తప్పుబట్టారు. బాలీవుడ్‌లోనూ నటులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ నేపథ్యంలో అతిథి దేవో భవ ప్రచార బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం అమీర్‌ను తొలగించింది. దీంతో ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ రేసులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్పా, అక్షయ్ కుమార్ ఉండగా, చివరకు బిగ్ బి వైపు ప్రభుత్వం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా తనను తొలగించడంపై అమీర్ స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తానన్నారు. తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నా లేకపోయినా ఇండియా ఇన్ క్రెడిబుల్‌గా ఉంటుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles