venkatramireddy responces on chandrababu chicago satate university doctorate

Y venkatramireddy comments on chandrababu doctorate

chandrababu, chikago university, doctarate, y.venkatramireddy, chicago state university, branding value,

Andhra pradesh former appsc chairman and former upsc member y.venkatramireddy comments on chandrababu chicago satate university doctorate.

చంద్రబాబు గౌరవ డాక్టరేట్ పై స్పందించిన వెంకట్రామిరెడ్డి

Posted: 12/22/2015 08:12 PM IST
Y venkatramireddy comments on chandrababu doctorate

నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గౌరవ డాక్టరేట్ అవార్డు ప్రకటించిన సందర్భంగా పలువురు పలు రకాలుగా స్పందించడం.. పలు విధాలను వారి అభిప్రాయాలను వెలిబుచ్చడం జరుగుతోంది. ఈ తరుణంలో చికాగో స్టేట్ యూనివర్శిటీ ఇచ్చిన డాక్డరేట్ పై యుపిఎస్సి మాజీ సభ్యుడు, ఎపిపిఎస్సి మాజీ ఛైర్మన్ వై.వెంకటరామిరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సరైన గుర్తింపు లేని ,ప్రాదాన్యం లేని యూనివర్శిటీలు తమ బ్రాండింగ్ పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ లు ఇస్తుంటాయని ఆయన వ్యాఖ్యానించారు.

చంద్రబాబుకు డాక్టరేట్ ప్రకటించిన చికాగో స్టేట్ యూనివర్శిటీ కి అమెరికాలో సరైన గుర్తింపు లేదని, గుర్తింపు పొందిన పూర్వ విద్యార్ధులు లేరని ఆయన అన్నారు. ప్రాభవం కోల్పోతున్న యూనివర్శిటీలు అతర్జాతీయ బ్రాండింగ్ కోసం అనుసరించే పద్దతులలో భాగంగా ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ఇస్తుంటాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబుకు డాక్టరేట్ ఇచ్చి సదరు చికాగో స్టేట్ యూనివర్సిటీ తన బ్రాండ్ ఇమేజ్ ను పెంచుకోగా, ఆ యూనివర్సిటీ అవార్డను అందుకుని చంద్రబాబు తన బ్రాండ్ ఇమేజ్ ను మసకబర్చుకున్నారన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  chikago university  doctarate  y.venkatramireddy  

Other Articles