ysrcp mla chevireddy bhaskarreddy fires on ap government

Chevireddy bhaskarreddy slams chandrababu government

ys jagan mohan reddy, ysrcp, call money, tdp call money scam, call money scandal, call money sex racket, assembly winter sessions, chevireddy bhaskar reddy, chandrababu, doctorate, chicago ouniversity

chevireddy bhaskarreddy slams chandrababu government, criticizes that chicago university has awarded doctorate for chandrababu for sucessfully operating sex racket by his party men

‘సెక్స్ రాకెట్ ప్రోత్సహానికి.. బాబుకు చికాగో యూనివర్సిటీ డాక్టరేట్’

Posted: 12/18/2015 01:39 PM IST
Chevireddy bhaskarreddy slams chandrababu government

ఆంధ్రరాష్ట్రంలో సెక్స్ రాకెట్ విజయవంతం అయ్యేలా ప్రోత్సహించినందుకు చంద్రబాబునాయుడికి చికాగో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చిందా..? అని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆనుమానం వ్యక్తం చేశారు. నీచమైన రాజకీయాలకోసం మహానుభావుడు అంబేద్కర్ ను వాడుకున్న దౌర్బాగ్య ముఖ్యమంత్రి చంద్రబాబు తప్ప దేశంలో మరొకరు లేరని అన్నారు.  ప్రజలు నమ్మి ముఖ్యమంత్రిని చేస్తే మొత్తం రాష్ట్రాన్ని చంద్రబాబు మోసం చేశారని అన్నారు. 'రుణాలు మాఫీ చేయలేదు. మిమ్మల్ని నమ్ముకున్నందుకు మహిళలు అప్పుల పాలయ్యారు. అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే ప్రజలు తగిన బుద్ది చెప్తారని అన్నారు.

అందుకే అధిక వడ్డీలకు డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితులు ఆసరగా తీసుకొని మహిళలను అసభ్యంగా చిత్రీకరించారు. వారితో బలవంతంగా వ్యభిచారం చేయించే పరిస్ధితి తీసుకొచ్చారు. మహిళలకు ఇలాంటి దుస్తితి కల్పించడానికి ఎలా మనసు వచ్చింది. అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసి నవ్వుతున్నారు' అని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో పార్టీలకు అతీతంగా మహిళలకు అండగా ఉందామని, చర్చ జరిపి నేరస్తులను శిక్షిద్దామంటే సీఎం ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత అసలు మాట్లాడేందుకు ఏమి ఉంటుందని అన్నారు. కుటుంబంలో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ముందు ఆ విషయం ఇంట్లో వారికి చెప్పి అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే నిర్ణయం ప్రకటిస్తారని ఉదహరించారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వం అండతో జరుగుతున్న దారుణాలను ప్రజలు గమనిస్తున్నారని, వాటన్నింటీకి బదుల్లిచ్చే సమయం వచ్చినప్పుడు తప్పక ఇస్తారని చెవిరెడ్డి అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chevireddy bhaskar reddy  chandrababu  doctorate  chicago ouniversity  

Other Articles