bollywood baadshah praises modi's government

Shah rukh khan says those who question his patriotism are stupid

shah rukh khan, patriotism, Stupid, PM Narendra modi, shah rukh khan, srk, srk patriotism, srk stupid, shahrukh kahn modi government, Shah Rukh Khan praises modi's government,

"If someone tells me that he is more patriotic than me, then he is stupid. Actually, we all are patriotic," Shah Rukh Khan said

మోడీ ప్రభుత్వంపై షారుఖ్ ఖాన్ ప్రశంపలు.. అందరం దేశభక్తులమని వ్యాఖ్య

Posted: 12/09/2015 11:29 AM IST
Shah rukh khan says those who question his patriotism are stupid

దేశంలో ఏ మహ్మదీయ సోదరుడిని కదిలించినా.. వారు మాట్లాడినా, మాట్లాడకపోయినా.. మీడియా అడిగే తొలి ప్రశ్న మాత్రం అసహనం. ఇక సెలబ్రిటీలే ఏ కార్యక్రమంలో బయట కనబడినా వారిని ముందు వాలిపోతున్న మీడియా ఇదే ప్రశ్నను గుచ్చి గుచ్చి అడుగుతుంది. అయితే ఇదే అనుభవం బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు కూడా ఎదురయ్యింది. అంతే దీనిపై స్పందించిన ఆయన తాను లౌకిక వాదినని రుజువు చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్నాడు.

దేశంలో అసహనంపై తాను చేసిన వ్యాఖ్యలు.. వివాదాస్పదమైన నేపథ్యంలో షారుఖ్ ఈ విధంగా స్పందించారు. ఓ  టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'అసహనం' చర్చ గురించి ప్రశ్నించగా 'దీని గురించి నిజంగా తనకేమీ తెలియదన్నారు. తాను ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా చెప్తానన్నారు. మంచి విషయాలు మాట్లాడుతానని.. అంతేకాకుండా తాను సెక్యులర్ అని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తానని ఆయన బదులిచ్చారు. దేశప్రజలందరూ ఐక్యంగా ప్రగతిని కోరుకోవాలని వారి మద్య లింగ, వర్ణ, ప్రాంత, కుల, మతాలన్న అంశఆలు అడ్డుగోడలు కాకూడదన్నారు. అలాంటి వాటిని తమ మనస్సులోకి కూడా రానీయకూడదన్నారు.

అందుకనే తాను సినిమాలు, నటన గురించి మాత్రమే మాట్లాడాలని నిశ్చయించుకున్నట్టు తెలిపాడు. తనకంటే ఎక్కువ దేశభక్తుడిని నేనే అని ఎవరైనా చెబితే.. అతను మూర్ఖుడని అన్నారు. దేశభక్తిలో ఎక్కువ, తక్కువ అనే హేతుబద్దలు వుండవన్నారు. అందరూ దేశభక్తులేనని చెప్పాడు. తాను గతంలో దేశంలోని పరిస్థితులపై తన అభిప్రాయాలు వెల్లడిస్తే వాటిని తప్పుగా అర్థం చేసుకుని, అన్వయించుకున్నారని షారుఖ్ చెప్పారు. పనిలో పనిగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై షారుఖ్ ప్రశంసల జల్లు కురిపించి..ఆయన పాలన అద్భుతంగా ఉందని కొనియాడారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shah rukh khan  patriotism  Stupid  PM Narendra modi  

Other Articles