Relief for flood-hit Chennai as rain stops

Chennai floods ndrf dg op singh says situation has improved

Chennai floods, northeast monsoon fury in Tamil Nadu, Tamil Nadu floods,India, Tamil Nadu, Tamil Nadu, Chennai, natural disasters, floods, chennai rains, kerala assembly, chennai flood relief, tamil nadu floods, chennai rescue work, floods rescue work, chennai latest news

Singh said that situation in the city is improving since the water is receding and electricity has been restored in many areas which are no longer water logged.

చెన్నైలో తగ్గుముఖం పడుతున్న వరద నీరు.. సహాయక చర్యలు ముమ్మరం

Posted: 12/04/2015 04:52 PM IST
Chennai floods ndrf dg op singh says situation has improved

సుమారుగా పది రోజుల నుంచి ఏకధాటిగా కురిసిన భారీవర్షాలతో కుదేలైన తమిళనాడు రాజధాని చెన్నైలో ఇవాళ తెల్లవారు జామునుంచి పరిస్థితి మెరుగవుతోందని జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్‌ ఎఫ్) డీజీ ఓపీ సింగ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చాలా ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పడుతోందని వెల్లడించారు. వరద తగ్గిన ప్రాంతాల్లో కరెంట్ పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. కమ్యూనికేషన్ నెట్ వర్క్ కూడా యుద్ద ప్రాతిపదికన మెరుగవుతోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని తమ బృందాలు సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. హోంశాఖ కార్యదర్శి, రిలీఫ్ కమిషనర్ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. ఇప్పటివరకు తాము 9 వేల మందిని కాపాడామని తెలిపారు. పంజాబ్ నుంచి 5 ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు ఈ తెల్లవారుజామున చెన్నై చేరుకున్నాయన్నారు. పుణే, పాట్నా, గువాహటి నుంచి ఐదేసి బృందాలు రానున్నాయని తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : heavy rains  chennai  air services  restarts  

Other Articles