Pawan Kalyan seeks appointment to meet Chandrababu Naidu

Pawan kalyan seeks appointment to meet chandrababu

Pawan Kalyan, Pawan Kalyan on AP, Pawan Kalyans Janasena, Janasena, Pawan Kalyan with chandrababu, Pawan Kalyan News, Pawan Kalyan updates

jana Sena Chief Pawan Kalyan has sought an appointment to meet AP Chief Minister Chandrababu Naidu on Thursday to discuss the issue of land acquisition in Thullur, Mangalagiri and other villages. Earlier, the farmers who are not willing to part with their lands reached out to Pawan Kalyan over the issue. Farmers from Tadepalli and Mangalagiri mandals have approached the courts, the latest to join the movement against land acquisition are the farmers from Thullur village.

చంద్రబాబును కలవనున్న పవన్

Posted: 11/11/2015 03:01 PM IST
Pawan kalyan seeks appointment to meet chandrababu

జనసేన పార్టీ అధ్యక్షుడు, తెలుగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ప్ర.జా సమస్యల మీద స్సందించనున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, రైతుల సమస్యలపై ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇందుకోసం ఆయన నేరుగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ కావాలని భావిస్తున్నారు. గతంలో కూడా ఏపి సిఎం చంద్రబాబు నాయుడును కలిసి రాజధాని గ్రామాల్లో బలవంతంగా భూములను లాక్కునేందుకు ప్రయత్నించడాన్ని వ్యతిరేకించారు. మిత్రపక్షమే అయినా చూస్తూ కూర్చోనని హెచ్చరించారు.

తాజాగా మరోసారి ఏపి సిఎం చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటి ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు చంద్రబాబు నాయుడుతో భేటికి అపాయింట్ మెంట్ కోరుతూ పవన్ సిఎం కార్యాలయానికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. రేపు తాను చంద్రబాబుతో భేటీ కావాలనుకుంటున్నానని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను కోరారు. పవన్ కల్యాణ్ అభ్యర్థనకు ఏపీ సీఎంఓ కూడా సానుకూలంగానే స్పందించే అవకాశాలున్నాయి. దీంతో రేపు మధ్యాహ్నం విజయవాడకు వెళ్లనున్న పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుతో భేటీ కావడం ఖాయమేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఏపి ప్రభుత్వం తరఫున అధికారికంగా ఆహ్వానం అందినా కానీ పవన్ షూటింగ్ కారణంగా హాజరుకాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles