Dont Misinterpret Quran to Have More Than One Wife

Dont misinterpret quran to have more than one wife

sharia law, ShariahSajida Bano, Gujarat High Court, Saurashtra region, Muslim men

In a strongly-worded order, the Gujarat High Court said the Quran was being misinterpreted by Muslim men to have more than one wife and the provision of polygamy was being misused by them for "selfish reasons".The high court on Thursday also stated that time has come for the country to embrace the uniform civil code as such provisions are in violation of the Constitution.

ఖురాన్ పేరుతో మళ్లీ పెళ్లి.?

Posted: 11/06/2015 10:14 AM IST
Dont misinterpret quran to have more than one wife

ముస్లింలు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు.. అలాగని ఖురాన్ లోనే ఉంది. అయితే దీని మీద గుజరాత్ హైకోర్ట్ తీవ్రంగా స్పందించింది. ముస్లింలు చాలా మంది ఇలా నాలుగు పెళ్లిళ్లు చేసుకునే అవకాశాన్ని తమ అవసరాలకు వాడుకుంటున్నారని మండిపడింది. నిజానికి ఒక భార్య లేదా భర్తను మాత్రమే చట్టం అనుమతిస్తుంది కానీ ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఓ ముస్లిం నలుగురిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. కానీ గుజరాత్ హైకోర్ట్ దీన్నే తప్పుపట్టింది. గుజరాత్ కు చెందిన జాఫర్ అబ్బాస్ అనే వ్యాపారి మరో పెళ్లికి సిద్దంకాగా ఆమె కేసు పెట్టింది.

తాను ఉండగానే.. తన అనుమతి లేకుండా తన భర్త మరో పెళ్లి చేసుకుంటున్నారని కేసు పెట్టింది. దాంతో పోలీసులు ఐపిసి సెక్షన్ 494 కింద కేసు నమోదైంది. సెక్షన్ 494 ప్రకారం ఒక జీవన భాగస్వామితో కాకుండా.. వారి అనుమతి లేకుండా మరో పెళ్లికి సిద్దం కావడం నేరం. అయితే దీని మీద అతను గుజరాత్ హైకోర్ట్ ను ఆశ్రయించారు. తన మీద వేసిన కేసు చెల్లదని వాదించారు. అయితే ఖురాన్ ప్రకారం తాము నాలుగు పెళ్లిళ్లు చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. దీన్ని కోర్ట్ తప్పుపట్టింది. ఖురాన్ ప్రకారం కొన్ని నిబంధనలకు లోబడి మాత్రమే నాలుగురిని పెళ్లి చేసుకునేందుకు అవకాశం ఉంది. అంతేకానీ ఉన్న భార్యను చిత్రహింసలు పెట్టి.. ఆమెను ఇంట్లోంచి పంపించేసి మరో పెళ్లికి సిద్దంకమ్మని చెప్పలేదని కోర్ట్ వ్యాఖ్యానించింది. ఇది తప్పు అని తేల్చింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sharia law  ShariahSajida Bano  Gujarat High Court  Saurashtra region  Muslim men  

Other Articles