Am happy to go back to my country

Am happy to go back to my country

chhota Rajan, India, Don, Mumbai, Dawood, Underworld don, chhota Rajan Happy

Underworld don Chhota Rajan was deported to India from Bali. He was escorted to the Bali airport in a bullet proof vehicle and a 10-car convoy. While coming out his cell, Rajan said, "Mai khush hun, apni dharti maa ke paas ja rha hun, khush hun (Am happy that i am going to my homeland)." Underworld don Chhota Rajan is likely to be deported to India today after a delay of about two days due to disruption of services at Bali airport. Reports say that flight services have been resumed at the airport.

ITEMVIDEOS: ఛోటా రాజన్ చాలా హ్యాపీ ఎందుకంటే..

Posted: 11/06/2015 09:06 AM IST
Am happy to go back to my country

అండర్ వరల్డ్ మాఫియా డాన్ ఛోటా రాజన్ ను ఈ ఉదయం సిబిఐ అధికారులు దిల్లీకి తీసుకువచ్చారు. దాదాపు 67 కేసుల్లో నిందితుడిగా నమోదైనా కానీ ఇప్పటి దాకా పోలీసులకు దొరకకుండా.. విదేశాల్లోనే ఉంటున్నారు. అయితే బాలిలో విమానాశ్రయంలో అక్కడి పోలీసులు అరెస్టు చేసిన తర్వాత భారత ప్రభుత్వం ఇండోనేషియాతో జరిపిన చర్చలు సఫలమై.. ఛోటా రాజన్ ను అప్పగించేందుకు ఒప్పుకున్నారు. అయితే మాఫియా డాన్ ఛోటా రాజన్ ఎవరి పేర్లు చెబుతారు అన్నది ఆసక్తిని రేపుతోంది. కాగా ఇప్పటికే దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ తో చాలా మంది పోలీసులకు సంబందాలు ఉన్నాయని ఛోటా వెల్లడించారు. తాజాగా తాను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నానని అంటున్నారు. ఎందుకంటే..

ఛోటా రాజన్ కోసం చాలా ఏళ్లుగా పోలీసులు వెతుకుతూనే ఉన్నారు.. కానీ అతడు మాత్రం విదేశాల్లోనే తలదాచుకున్నారు. అయితే దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఛోటా రాజన్ ఇండియాకు తిరిగి వచ్చాడు. ముంబై వరుస పేలుళ్ల తర్వాత జరిగిన కొన్ని ఘటనల తర్వాత ఛోటా రాజన్ దేశం వదిలిపారియారు. అయితే తాజాగా ఇండియాకు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందిన అంటున్నారు. ఐ యామ్ హ్యాపీ.. చాలా కాలం తర్వాత స్వదేశానికి తిరిగి వెళుతున్నానంటూ బాలిలో విలేకరులతో వ్యాఖ్యానించారు. అయితే ఇండియాకు వస్తే దావూద్ గ్యాంగ్ నుండి ఛోటా రాజన్ కు ముప్పు ఉందని వచ్చిన వార్తలను అతడు ఖండించాడు. తాను దావూద్ కు భయపడటం లేదని అన్నారు.. అలాగే చివరి క్షణం వరకు కూడా దావూద్ కు వ్యతిరేకంగా పని చేస్తానని అన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chhota Rajan  India  Don  Mumbai  Dawood  Underworld don  chhota Rajan Happy  

Other Articles