Dalith women stripped naked in UP

Dalith women stripped naked in up

Dalith women, naked women, uttapradesh, Akhilesh Yadav, Police, UP Police, Dalith in Uttarpradesh

Just days after Dadri lynching, another embarrassing video of two women being stripped and dragged on the streets in the daylight in a village in Uttar Pradesh has emerged. The rather sad part of the entire video is that the police, instead of helping the women, watch the whole incident shamelessly. Are you thinking which place we are talking about? Don’t be puzzled, we are in still in India which talks about ‘Digital India’, and we are talking about ‘the answer state’, i.e. Uttar Pradesh. This is the same state where a week ago, a Muslim man was lynched brutally just because he allegedly ate beef.

ITEMVIDEOS: రోడ్డు మీద ఆడవాళ్ల బట్టలూడదీశారు

Posted: 10/09/2015 11:00 AM IST
Dalith women stripped naked in up

భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం.. ఏకత్వంలో భిన్నత్వం. కానీ మాటల వరకు చాలా బాగా ఉన్న భిన్నత్వంలో ఏకత్వం ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోదు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అంటరానితనం ఏలుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే మరీ ఎక్కువగా ఉంది. అంటరానితనం మీద ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా సభ్య సమాజం సిగ్గు పడే ఘనట ఒకటి చోటుచేసుకుంది. నడిరోడ్డు మీద ఆడవాళ్ల బట్టలూడదీసిన ఘటన సిగ్గుమాలింది. న్యాయం చెప్పాల్సిన పోలీసులు సినిమా చూసినట్లు చూస్తే.. ఏం చెయ్యాలో అర్థంకాక సిగ్గుతో తలదించుకోవడం తప్ప మరేమీ చెయ్యలేని పరిస్థితి. ఉత్తర్ ప్రదేశ్ లో తాజాగా చోటుచేసుకున్న ఘటన మీద సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల ఆటవిక రాజ్యం నడుస్తోంది. అక్కడ ప్రభుత్వాల కన్నా పాత కాలం నాటి కట్టుబాట్లు మానవీయ విలువలను మంటగలుపుతున్నాయి. తాజాగా యుపిలో జరిగిన ఘటన అందరికి సిగ్గుతెప్పిస్తోంది. అందరం సిగ్గుతో అవమానంతో తల దించుకుే ఘటన. గ్రామంలోని దళితులను ఎలా చూస్తారు అన్న దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ ఘటన. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ గ్రామంలో ఉంటున్న దళిత కుటుంబానికి చెందిన  మొత్తం నలుగురు మనుషులను రోడ్ల మీద దారుణంగా అవమానించారు. అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఏదో విషయంలో అక్కడ ఉంటున్న స్థానికులు ఏకంగా వీధుల్లోకి ఈడ్చుకువచ్చి వాళ్ల బట్టలూడదీశారు. పాపం సిగ్గుతో తన బిడ్డను అడ్డం పెట్టుకుంది ఓ తల్లి. అయితే మొత్తం ఘటనను చూస్తున్న పోలీసులు కనీసం వాళ్లకు ఎలాంటి సహాయం చెయ్యడమో లేదంటే అడ్డకోవడమో చెయ్యలేదు. ఈ వీడియోను ఓ వ్యక్తి యుట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీని మీద సర్వత్రా నిరసన వ్యక్త మవుతోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dalith women  naked women  uttapradesh  Akhilesh Yadav  Police  UP Police  Dalith in Uttarpradesh  

Other Articles