కొట్టెయ్యడం అంటే ఏదో పక్కవారి దగ్గరున్న పెన్సిలో, పెన్నో లేదంటే నాలుగు రూపాయలో కొట్టెయ్యడం గురించి విన్నాం. బ్యాంకుల్లో బ్యాంకు గోడలకు కన్నాలు వేసి కోట్లకు కోట్లు కొట్టెయ్యడం గురించి విన్నాం.. గోల్డ్ షాపుల్లో విలువైన బంగారం, వజ్రాలు కొట్టేయడం గురించి విన్నాం కానీ విమానం కొట్టెయ్యడం గురించి ఎన్నడైనా విన్నారా..? కానీ ఓ విమానాశ్రయంలో ఆగి ఉన్న విమానాన్ని కొట్టేయాలని తెగ ట్రై చేసి.న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అయినా విమానాన్ని కొట్టేయడం ఏంటో అని ఆశ్చర్యపోతున్నారా..? కానీ నిజమే ఏకంగా విమానాన్నే కొట్టేయాలనుకున్న ఆ మాయదారి దొంగ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
అమెరికాలోని టెక్సాస్ లో ఓ దొంగ చేయాలనుకున్న దొంగతనం వార్తల్లో నిలుస్తోంది. అక్కడి విమానాశ్రయానికి చెందిన సెక్యూరిటీ గేట్ ను బద్దలు కొట్టి.. ఓ దొంగ లోపలికి ప్రవేశించాడు. అక్కడ ఉన్న ప్రైవేట్ వ్యాపార సంస్థకు చెందిన లియర్ జెట్ విమానాన్ని కొట్టేయాలని సదరు దొంగ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. దొంగచాటుగా విమానాశ్రయంలోకి ప్రవేశించిన ఆ దొంగ విమానం టైర్ల దగ్గర ఉన్న చాక్స్ ను తీసేశాడు. అలా దొంగతపం చేస్తున్న క్రమంలోనే అక్కడున్న పోలీస్ అధికారి అతన్ని చేశాడు. ముందు మాటలతో చెబుదామని అనుకున్నా.. మనోడు వినకపోవడంతో తన స్టెన్ గన్ తో షాక్ ఇచ్చాడు. తర్వాత అక్కడున్న సెక్యురిటీని పిలిచి మనోడిని పట్టుకున్నారు. అయితే ఆ దొంగ మతిస్థిమితం లేదని.. ఏం చేశాడో కూడా అతడికి తెలియదని డాక్టర్ల ద్వారా తెలిసింది. మొత్తంగా సినిమా స్టోరీలోలాగా భలే ట్విస్టింగ్ గా అనిపించింది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more