Man kills daughter and drinks her blood

Man kills daughter and drinks her blood

UP, Lucknow, Kushi, Jamura, giriraj pal, drink blood

One of the most atrocious act was reported by the police recently about a father killing his own 9-year-old daughter and drinking her blood.The grotesque incident details could easily given anyone nightmares for months, According to the report, Girijesh Pal a resident from Jamaura village in Sikandra Tehsil was obsessed with occult science and strived to become a 'Tantrik' himself.

కూతురిని చంపి రక్తం తాగి..

Posted: 09/10/2015 03:15 PM IST
Man kills daughter and drinks her blood

భారతీయులు అంటేనే బంధాలు, బంధుత్వాలకు చిరునామా. అలాంటి దేశంలొ ఈ మధ్యన దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. కన్న తల్లిని చంపిన కొడుకు, కన్న తండ్రిని నరికి చంపిన కొడుకు, బతికుండగానే కన్న తల్లిని కాటికి తరలించిన కొడుకు ఇలా రకరకాల వార్తలు విన్నాం. ఆ వార్తలు విని మనిషితనం చచ్చిందా అని సిగ్గుపడ్డాం.. కానీ అంతకన్నా దారుణాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన గురించి తెలిసిన వాళ్లు ఆశ్చర్యపోవడం అందరివంతవుతుంది. అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన కూతురిని ఏ తండ్రైనా అపురూపంగా, ఆప్యాయంగా చూసుకుంటారు. కానీ ఓ కసాయి తండ్రి మాత్రం తన కూతురును చంపి.. రక్తం తాగాడు.

కన్న కూతురిని చంపి. ఆమె రక్తాన్ని జ్యూస్ లాగా తాగేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వినడానికి వింతగా ఉన్నా కానీ ఇది నిజం. తన కూతురు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి ఆ తల్లి అరవడం మొదలుపెట్టింది. దాంతో అక్కడ చుట్టుపక్కలున్న వారు పాపను వెంటనే ఆస్పత్రికి తరలించారు. జమురా గ్రామంలో ఉంటున్న గిరిరాజ్ పాల్ అనే వ్యక్తి మంత్రతంత్రాలను బాగా నమ్ముతాడు. క్షుద్ర పూజలు చెయ్యడం అతనికి బాగా అలవాటు. అయితే మరి ఎవరు చెప్పారో తెలియదు కానీ తాజాగా తన తొమ్మిదేళ్ల కూతురు ఖుషిని ఓ హ్యాండ్ పంప్ తో తల మీద కొట్టాడు. దాంతో అమ్మాయి తలకి తీవ్ర గాయం కావడంతో రక్త ధారలా కారింది. అలా అమ్మాయి రక్త కారుతుంటే ఆ కసాయి తండ్రి ఓ ప్లేట్ లో రక్తాన్ని పట్టుకొని తాగేశాడు. గుడికి వెళ్లి వచ్చిన తల్లి తన కూతురును ఆస్పత్రికి తరలించినా కానీ అప్పటికే మరణించినట్లు వెల్లడించారు. తండ్రి పదానికి మచ్చ తెచ్చిన ఆ వ్యక్తి ప్రస్తుతం కటకటాల్లో ఉన్నాడు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP  Lucknow  Kushi  Jamura  giriraj pal  drink blood  

Other Articles