governer suggests both telugu states ministers to control ragging

Will control ragging in colleges and universities says governor narasimhan

esl narasimhan, state governer, ragging in collages, rajnath singh, union home minister, anti ragging measures, delhi, Universities, telugu states governer

telugu states governer esl narasimhan suggests both telugu states ministers to control ragging after meeting with union home minister rajnath singh

రెండు తెలుగు రాష్ట్రాలలో ర్యాగింగ్ ను అరికడతాం:

Posted: 08/20/2015 08:55 PM IST
Will control ragging in colleges and universities says governor narasimhan

ఉభయ తెలుగు రాష్ట్రాలలో ర్యాగింగ్ ను అరికడతామని రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింభన్ అన్నారు. కాలేజీలు, యూనివర్సిటీలలో ర్యాగింగ్ను కఠినంగా అణిచేస్తామని ఆయన తెలిపారు. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గురువారం నాడు ఢిల్లీలో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆయన రాజ్నాథ్ సింగ్కు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గవర్నర్ ర్యాగింగ్ భూతాన్ని అరికట్టేందుకు త్వరలోనే సమావేశం ఏర్పాటుచేస్తామని చెప్పారు.

రెండు రాష్ట్రాల్లో ర్యాగింగ్ను అరికట్టాలని విద్యాశాఖ మంత్రులకు సూచించినట్లు చెప్పారు. ర్యాగింగ్ పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పామన్నారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ కాలేజీలు, యూనివర్సిటీలలో ర్యాగింగ్ జరగనీయకుండా చూడాలని ఆయన స్పస్టం చేశారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో ర్యాగింగ్ చేయడానికి అనుమతించేది లేదన్నారు. ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి మారిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వ్యవహారంలో రాజ్యాంగ పరమైన సమస్య ఎదురైనప్పుడు దాన్ని అధిగమిస్తామని కేంద్ర హోం మంత్రికి నరసింహన్ చెప్పినట్లు తెలిసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : esl narasimhan  state governer  ragging in collages  rajnath singh  

Other Articles