Errabelli | Errabelli Dayakar Rao | TTDP

Ttdp leader errabelli dayakar rao is alone in the party

Errabelli, Errabelli Dayakar Rao, TTDP, TDP, Chandrababu Naidu

TTDP Leader Errabelli Dayakar Rao is alone in the party. The TDP leaders are not supporting to Errabelli in the party.

ఎర్రబెల్లి... ఓ ఒంటరి నాయకుడు

Posted: 08/13/2015 12:40 PM IST
Ttdp leader errabelli dayakar rao is alone in the party

జగమంత కుటుంబం నాదీ.. ఏకాకి జీవితం నాదీ.. సంసార సాగరం నాదే.. సన్యాసి జీవితం నాదే అన్నట్లు తయారైంది టిటిడిపి సీనియర్ నేత ఎర్రబెల్లి పరిస్థితి. అందరు ఉన్నా ఒంటిరిగా మిగిలిపోతున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు... వరంగల్‌కు చెందిన టీడీపీ నేత. జిల్లాలో టీడీపీ తరఫున ఏకైక ప్రజాప్రతినిధి.టీడీఎల్పీ నేత  కూడా.పార్టీలో మాస్‌ లీడర్‌ అన్న పేరుంది.అధినేతకు దగ్గరివాడన్న ప్రచారం ఉంది.తనకున్న ఫాలోయింగ్‌తో రాష్ట్రస్థాయి నేతగా ఎదిగారు ఎర్రబెల్లి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ, అధికారంలో ఉన్నప్పుడూ పార్టీ వెంటే ఉన్నారు.కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని  ఉన్న ఎర్రబెల్లి...తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తిరుగులేని విధంగా ఉంటారని జిల్లా నేతలు అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌  అయినట్లు కనిపిస్తోంది.

సీనియర్లుగా చెప్పుకునేవారంతా దూరంగా ఉండటంతో పార్టీ భారం ఎర్రబెల్లిపై పడుతోంది.కానీ ఆయనపై జూనియర్లు,ద్వితీయ  శ్రేణి నేతలు గుర్రుగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.ఆయనకు సహాయ నిరాకరణ చేస్తున్నారట.ఎర్రబెల్లి ఆధ్వర్యంలో జరిగే  ప్రతీ సమావేశానికి ఆయన అనుచరులు తప్ప పార్టీలో మిగతా నాయకులు ఎవరూ కనిపించట్లేదు. జిల్లా కార్యవర్గం ఎన్నిక  ఆగిపోయి చాలా రోజులైంది. దీంతో ఎర్రబెల్లిపై లోకల్‌ లీడర్లు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.ఆయన తన మనుగడ కోసం పనిచేస్తున్నారు తప్ప,పార్టీ అభివృద్ధి కోసం కాదన్న చర్చ వరంగల్‌ టీడీపీలో జరుగుతోంది.

కొన్ని నెలల క్రితం కేసీఆర్‌ను ఎర్రబెల్లి కలవడంతో ఆయనపై నిరసన స్వరాలు మొదలయ్యాయంటారు. దయాకర్‌ ఎప్పటికైనా పార్టీ వీడతారన్న ప్రచారం ఇప్పటికీ సద్దుమణగకపోవటంతో... టీడీపీలోని ద్వితీయ శ్రేణి నేతలెవరూ  ఆయన్ని నమ్మడం లేదట. నియోజకవర్గాల్లో జరుగుతున్న పార్టీ సమావేశాలకు టీడీపీ నేత రేవూరి దూరంగా ఉంటున్నారు.  ఇందుక్కారణం ఎర్రబెల్లితో పొసగకపోవడమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలే తక్కువ మంది ఉన్న పార్టీలో ఎవరికీ ఎలాంటి  పదవులు ఇవ్వకపోవడంపై ఛోటామోటా లీడర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Errabelli  Errabelli Dayakar Rao  TTDP  TDP  Chandrababu Naidu  

Other Articles