KCR | Policy | Liquior | Kishan Reddy

Kcr expecting more money on liquior policy

KCR, Policy, Liquior, Kishan Reddy, Liquior Policy, Telangana, Treasury

KCR expecting more money on liquior policy. BJP President Kishan Reddy said that KCr hope more income to treasury by new liquoir policy.

కేసీఆర్ .. మరీ అంత కక్కుర్తి పడుతున్నారా...?

Posted: 08/08/2015 04:02 PM IST
Kcr expecting more money on liquior policy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... కక్కుర్తి పడుతున్నారట. అవును మీరు చదివిన స్టేట్ మెంట్ అక్షరాల నిజం. కే. చంద్రశేఖర్ రావు చాలా కక్కుర్తి పడుతున్నారట. ఎందుకంటే డబ్బుల కోసం అంతలా కక్కుర్తి పడున్నారట. తెలంగాణ ప్రభుత్వం దేశంలోని మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాల జాబితాలో రెండో రాష్ట్రంగా ఉంది. గుజరాత్ రాష్ట్రం తర్వాత మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కింది. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటున్న కేసీఆర్ మాత్రం కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారని తీవ్రంగా మండిపడుతున్నారు. అవును ఆ మండిపడుతున్నది ఎవరు అనుకుంటున్నారా..? బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.

తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమే అయినా కానీ లీప్ లిక్కర్ కోసం కక్కుర్తి పడుతున్నారని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా తీసుకురానున్న మద్యం పాలసీలో చీప్ లిక్కర్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడుతున్నారు. మండలం ఒక యూనిట్ గా లిక్కర్ పాలసీని తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మద్యం పాలసీని తీసుకురావాలని చూస్తోంది. అయితే దీనిపై అప్పుడే విమర్శలు కూడా వస్తున్నాయి. చవక మద్యం పేరుతో తెలంగాణ ప్రభుత్వం కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారని కిషన్ రెడ్డి అన్న దానిని సపోర్ట్ చేసే వాళ్లు చాలా మందే ఉన్నారు. మరి దీని మీద తెలంగాణ ప్రభుత్వం కానీ, కేసీఆర్ గాని ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Policy  Liquior  Kishan Reddy  Liquior Policy  Telangana  Treasury  

Other Articles