Jammu kashmir | Militants | ncounter | BSF

Two jawan and one militant killed in jammu kashmir encounter

Jammu kashmir, JK, Militants, Encounter, BSF, CRPF, Army, National High way

Two jawan and one militant killed in Jammu kashmir encounter Two BSF jawans and a militant were killed and eight others injured when militants on Wednesday attacked a convoy of the border guarding force on the Jammu-Srinagar National Highway in Udhampur district.

జమ్ము కాశ్మీర్ లో ఉగ్రపంజా..ఇద్దరు జవాన్ల మృతి

Posted: 08/05/2015 11:00 AM IST
Two jawan and one militant killed in jammu kashmir encounter

పంజాబ్ లో ఉగ్రవాదుల దాడి ఘటనను మరువక ముందే మరోసారి బిఎస్ఎప్ వాహనం మీద దాడిచేసి ఇద్దరు జవాన్ల మృతికి కారణమయ్యారు. జమ్ము కాశ్మీర్ లో బిఎస్ఎప్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్ మీద ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి దాడికి తెగపడ్డారు. కాన్వాయ్ లోనికి చొచ్చుకువెళ్లడానికి ఎంతో ప్రయత్నించినా ఉగ్రవాదులను జవాన్లు తూటాలతో తిప్పికొట్టారు. అయితే ఉగ్రవాదులు అకస్మాత్తుగా జరిపిన దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. కాగా జవాన్లు జరిపిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందినట్లు సమాచారం.

ఉగ్రవాదుల దాడిపై అప్ డేట్స్..
* ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చారు.. అందులో ఒక ఉగ్రవాది బిఎస్ఎప్ జవాన్ల బస్సులోకి వచ్చేందుకు ప్రయత్నించారు.
* మంత్రి జితేంద్ర సింగ్ జిల్లా కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు. అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే మరింత బలగాలను కోరాలని సూచించారు.
* బిఎస్ఎప్, సిఆర్పీఎఫ్, ఆర్మీ అధికారులు ఆపరేషన్ లో పాల్గొన్నారు.
* గాయపడిన కొంత మంది ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కున్నారు.
* ప్రస్తుతం ఇంకా రెండు పక్షాల నుండి దాడులు జరుగుతూనే ఉన్నాయి.
* జమ్ము వ్యాలీకి వెళ్లే హైవే మీద కాల్పులు జరగడం మీద మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. మిలిటెంట్ ఫ్రీ ఏరియాలో ఉగ్రదాడులు జరగడం దురదృష్టకరమని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jammu kashmir  JK  Militants  Encounter  BSF  CRPF  Army  National High way  

Other Articles