Nagam janardhan reddy | tdp | telangana | bjp

Nagam janadhan reddy clear that he is not joining into tdp

Nagam janardhan reddy, tdp, telangana, bjp, pressmeet

Nagam janadhan reddy clear that he is not joining into tdp. A political gossip got viral in telangana that nagam will join the tdp soon. but nagam conform that not at all.

అబ్బా.. నాగం గారు రైమింగ్ అదిరింది

Posted: 05/19/2015 08:11 AM IST
Nagam janadhan reddy clear that he is not joining into tdp

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేత నాగం జనార్దన్ రెడ్డి. నారా చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీలో ఎంతో కీలకనేతగా ఎదిగిన నాగం తర్వాత పార్టీని వీడి బిజెపి పార్టీలో చేరారు. అయితే గత కొంత కాలంగా బిజపి పార్టీలో అంత క్రియాశీలంగా లేని నాగం జనార్దన్ రెడ్డి   తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరతారు అన్న పుకార్లు వినిపించాయి. బీజేపీని వీడేది లేదు.. టీడీపీలో చేరబోయేది లేదని మాజీ మంత్రి, బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు. బీజేపీలో సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని, పార్టీని వీడి టీడీపీలో చేరాలని ప్రయత్నిస్తున్నానని, అందుకే పార్టీ కార్యాలయంలో కాకుండా బయట ప్రెస్‌మీట్లు పెడుతున్నారని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరేది లేదని బలే రైమింగ్ తో చెప్పారు నాగం.

పార్టీ గురించి స్పష్టత ఇస్తూనే మిగిలిన విషయాలపై నాగం జనార్దన్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. పెండింగ్‌లో ఉన్న 29 ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఈ నెల 21 నుంచి ప్రాజెక్టులను పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం కరువు మండలాలను గుర్తించకపోవడంతో కేంద్రం నుంచి నిధులు రావడం లేదన్నారు. ఉద్యోగుల విభజన వెంటనే పూర్తి చేయాలన్నారు. పేదలకు ఇండ్ల్లు నిర్మించాలనే సాకుతో ప్రభుత్వం ఓయూ భూములు తీసుకోవాలని చూస్తే ఉద్యమం తప్పదన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagam janardhan reddy  tdp  telangana  bjp  pressmeet  

Other Articles