actor shivaji Makes controversial comments bjp party and questioned sujana chowdary about special status

Actor shivaji controversial comments bjp party questioned sujana chowdary

actor shivaji, telugu actor shivaji news, ap special status, mp sujana chowdary, venkaiah naidu, chandrababu naidu, pawan kalyan, special status issue news

actor shivaji controversial comments bjp party questioned sujana chowdary : actor shivaji Makes controversial comments bjp party and questioned sujana chowdary about special status

టీడీపీ ఎంపీని సూటిగా ప్రశ్నించిన నటుడు శివాజీ

Posted: 05/08/2015 08:30 PM IST
Actor shivaji controversial comments bjp party questioned sujana chowdary

ఏపీకి ప్రత్యేక హోదాకోసం నటుడు శివాజీ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే! ఈ దీక్షతో ఆయన అందరి దృష్టిని తనవైపుకు ఆకర్షించాడు. అయితే.. రానురాను శివాజీ ఆరోగ్య పరిస్థితి క్షీణించిన నేపథ్యంలో పోలీసులు ఇతని దీక్షను భగ్నం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం గురువారం సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం ఆయన బీజేపీ హోదా ఇవ్వని బీజేపీ మీద తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వచ్చారు. అదే సమయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు ఏకంగా ప్రశ్నావళినే సంధించారు. ఇక చివరగా ఆయన టీడీడీ ఎంపీ సుజనా చౌదరిని కూడా వదల్లేదు.

తాజాగా నటుడు శివాజీ ఎంపీ సుజనాను సూటిగా ఓ ప్రశ్న అడిగారు. ఏపీకి కేంద్రం ఇస్తానన్న రూ.14 వేల కోట్లలో రూ.10 వేల కోట్లు వచ్చినట్లు సుజనా చెబుతున్నారని.. ఆ డబ్బు ఏపీ ఖజానాకు చేరిందా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై సుజనా చెబితే సరిపోదని.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చెప్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు వెయ్యి కిలోమీటర్లు రోడ్లు వేయడానికి కూడా సరిపోవని విమర్శించారు.

మరోవైపు బీజేపీ పార్టీ మీద శివాజీ విమర్శలూ చేస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని అన్నారు. దీనికోసం రెండు రాష్ట్రాల నాయకులను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో నాయకులపై కేసులు పెట్టడమో, లేక పాత కేసులను తిరగదోడడమో చేయడం ద్వారా భయపెట్టడానికి కూడా బీజేపీ యత్నిస్తోందని విమర్శించారు.

బీజేపీ వలలో నాయకులు పడరాదని, ఆ పార్టీ కుట్రలను గమనించాలని అన్నారు. ‘ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్రంలో ప్రవేశించండి.. మాకేమీ అభ్యంతరం లేదు’ అని శివాజీ అన్నారు. ‘ఈ జిత్తులమారీ రాజకీయాలు అవసరమా? ఎన్నికోట్ల మంది పిల్లల ఉసురు పోసుకుంటారండీ.. మీ రాజకీయాల కోసం?’ అంటూ ఆయన బీజేపీని నిలదీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : telugu actor shivaji  ap special status  mp sujana chowdary  

Other Articles