IPL bans Sunil Narine from bowling offspin

Sunil narine barred from bowling off spin in ipl

Sunil Narine barred from bowling off-spin in IPL, BCCI, Cricket, Indian Premier League, KKR, Narine ban, Sunil Narine, IPL 8, IPL 8 Just In, IPL 8 News, Dwayne Bravo, Brad Hogg, MS Dhoni, sunil narine, Kolkata Knight Riders (KKR)

Sunil Narine's return from a bowling ban didn't last too long. The spinner, who made his comeback to cricket with Indian Premier League (IPL) side Kolkata Knight Riders, has now been banned from bowling offspinners after being reported for suspect action on 22 April.

నరేన్ మళ్లీ వెంటాడిన నిషేధం..

Posted: 04/29/2015 09:30 PM IST
Sunil narine barred from bowling off spin in ipl

ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్కు ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ సీజన్ కు రెండు రోజుల ముందు తన బౌలింగ్ పై చెలరేగిన అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసుకుని తన జట్టు కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిధ్యం వహించిన వెస్టిండీస్ మిస్టీరియస్ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ పై మరోమారు బీసీసీఐ నిషేదం విధించింది. ఆయన విసరుతున్న ఆఫ్ స్పిన్ బౌలింగ్పై మరోమారు దుమారం చెలరేగడంతో నిషేధం విధించారు. నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నాడని నరైన్పై ఫిర్యాదు రావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ, ఐపీఎల్ నిర్వహించే మ్యాచ్ల్లో ఈ నిబంధన వర్తిస్తుంది.

కాగా, ఈ నెల 22న విశాఖపట్నంలో సన్ రైజర్స్  హైదరాబాద్ తో జరిగిన కోల్ కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ లో నరేన్ బౌలింగ్ కోంత అనుమానాస్పదంగా వుందని ఆన్ ఫ్టీల్డ్ అంపర్లు వినీత్ కుల్ కర్ణీతో పాుట రిచార్డ్ ఇల్లింగ్వర్త్ లు గమనించారు. మ్యాచ్ పూర్తి కావడంతో ఈ విషయాన్ని అధికారుల వద్దకు తీసుకువెళ్లారు. దీంతో ఈ అంశమై భేటీ అయిన బోర్డు ఇవాళ ఆయన స్పిన్ బౌలింగ్ పై నిషేధం విధించింది. అయితే ఐపీఎల్లో నరైన్ కొనసాగవచ్చని, ఆఫ్ స్పిన్ కాక ఇతర డెలివరీలు వేయాలని బీసీసీఐ పేర్కొంది. బుధవారం బోర్డు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆఫ్ స్పిన్నర్ అయిన నరైన్కిది ఇబ్బందికర పరిణామమే.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 8  Sunil Narine  Kolkata Knight Riders  

Other Articles