Chandrababu | Birthday | celebrations

Ap cm chandrababu naidu today celebratimg his 64the birth day

ap, cm, chandrababu, birthday, celebrations, tdp, office

Ap cm chandrababu naidu today celebratimg his 64the birth day. After ap bifericatiion chandrababu celebrating his first birth day in ap. tdp leaders arranged all formalities at tdp party office.

ఈరోజు బాబు బర్త్ డే.. నిరాడంబరంగా వేడుక

Posted: 04/20/2015 07:59 AM IST
Ap cm chandrababu naidu today celebratimg his 64the birth day

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేటితో 65వ ఏటలోకి అడుగు పెడుతున్నారు. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలిసారిగా చంద్ర బాబు తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఎటువంటి అట్టహసం లేకుండా నిరాడంబరంగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో తన పుట్టిన రోజును జరుపుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ పూల దండలు, బొకేలు, కేకులను తీసుకురావొద్దని ఆయన ఇప్పటికే కోరారు. సోమవారం ఉదయం హైదరా బాద్‌లోని తన నివాసం నుంచి నేరుగా పార్టీ కార్యాలయమైన ఎన్టీఆర్‌ భవన్‌కు చేరుకోనున్న చంద్రబాబు ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య, ఆరోగ్య, దంత, కళ్ల శిబిరాలను ప్రారంభించనున్నారు. గంటపాటు పార్టీ కార్యాలయంలో ఉంటున్న చంద్రబాబు తనను కలిసేందుకు వచ్చే నేతలతో సమావేశం అవుతారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో క్యాంపు కార్యాలయమైన లేక్‌వ్యూ అతిథి గృహానికి చేరుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సీఎం కార్యాలయ అధికారులతో సమావేశం కానున్నారు. ఫైళ్ల పరిశీలనతో పాటు ముఖ్యమైన అంశాలకు సంబంధించి ఆయన అధికారులతో చర్చించనున్నారు. పది గంటల ప్రాంతంలో లేక్‌వ్యూ అతిథి గృహం నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రాయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో అనంతపురం జిల్లా పర్యటనకు బయలుదేరుతారు. జిల్లాల్లో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు స్థానికంగా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా పర్యటనను ముగించుకుని సోమవారం సాయంత్రానికి హైదరాబాద్‌ చేరుకుంటారు.

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : ap  cm  chandrababu  birthday  celebrations  tdp  office  

Other Articles