ఆడది కనబడితే చాలు కాటువేస్తున్న మానవ మృగాళ్లకు ఓ హెచ్చరిక. కామంతో కళ్లు మూసుకుపోయిన, కామాంధులకు ఇది తగిన శాస్ర్తి. మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తిని వీధుల్లోకి లాగి చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. నాగాలాండ్ కు చెందిన ఓ మహిళను ఫరీద్ ఖాన్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. అయితే ఓ వర్గానికి చెందిన మహిళ కావడంతో ఎక్కువ సంఖ్యలో జనాలు పోగయ్యారు. కస్టడీకి తరలించాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే నిందితున్ని కఠినంగా శిక్షించాలని సుమారు నాలుగువేల మంది జైలుపై దాడికి చేశారు. జైలు గేట్లను బద్దలుకొట్టి నిందితుడైన ఫరీద్‌ఖాన్‌ను బయటికి తీసుకొచ్చారు. నగ్నం గా వీధుల్లో ఊరేగిస్తూ నగరంలోని సిటీ టవర్ వరకూ ఈడ్చుకెళ్లారు, అక్కడే ఉన్న పది వాహనాలకు నిప్పంటించారు. కసితో ఉన్న ప్రజలు నిందితున్ని తీవ్రంగా కొట్టి చంపేశారు. పరిస్థితిని అదుపు చెయ్యడానికి పోలీసులు కాల్పులు జరిపారు దాంతో ఓ వ్యక్తి మృతి చెందాడు, జనాన్ని చెదరగొట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నాగాలాండ్‌లో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని మూకుమ్మడిగా కొట్టిచంపడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ జిలియాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనికైనా చట్టాలున్నాయని, ప్రజలు అలా చట్టాలను చేతిలోకి తీసుకొని వ్యవహరించడం తప్పు అని ఆయన అన్నారు. 'ది ఒక వర్గానికి సంబంధించిన విషయం కాదు. భద్రతా లోపానికి చెందిన విషయం. చట్టాలను చేతుల్లోకి తీసుకోవడం నేను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ ఘటన పై పూర్తి స్థాయిలో దర్యాప్తకు ఆదేశిస్తామని అన్నారు. జైలుపై దాడికి వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మరో వైపు ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నాగాల్యాండ్ లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more