Worlds richest people the hurun global rich list 2015 bill gates mark zuckerberg

the hurun global survey, world richest people, world richest people 2015, bill gates, mark zuckerberg news, the global survey, Carlos Slim Helu family, Warren Buffet, Amancio Ortega, Larry Ellison, Bernard Arnault, Mark Zuckerberg, Charles Koch David Koch

worlds richest people The Hurun Global Rich List 2015 bill gates mark zuckerberg : The Hurun Global Rich List 2015 ranked 2,089 billionaires from 68 countries, in a record-breaking year for the world’s billionaires.

2015 సర్వే: ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికులు వీళ్లే!

Posted: 02/04/2015 07:26 PM IST
Worlds richest people the hurun global rich list 2015 bill gates mark zuckerberg

‘ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికులు ఎవరు?’ అన్న అంశంపై ప్రతిఏటా సర్వేలు జరుగుతున్న విషయం తెలిసిందే! ఈసారి కూడా ఆ తరహాలోనే 2015లో ఎక్కువ ధనికులు ఎవరనే విషయంపై ‘ద హురున్ గ్లోబర్’ ఓ సర్వే నిర్వహించింది. గతేడాదితో పోల్చుకుంటే ఈ సర్వేలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ మాత్రం మళ్లీ మొదటి స్థానాన్నే ఆక్రమించుకున్నాడు. అంతేకాదు.. ఈసారి ఇతని ఆదాయం 17% మరింత పెరిగిందని ఆ సర్వే లెక్కలు తెలుపుతున్నాయి.

మొత్తం 68 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 2,089 బిలియనీర్లు వున్నట్లు తేలింది. వీరందరిలోనే 649 మంది తమ ఖజానాను మునుపటి కంటే ఎక్కువగా పెంచుకోగా.. 341 కొత్తవాళ్లు వున్నట్లుగా తెలిసింది. 230 మంది తమ పాత ర్యాంకులోనే వుండగా, 869 మంది మాత్రం తమ ర్యాంకు స్థానాన్ని దిగజార్చుకున్నారు. ఇంకో విచారకరమైన వార్తేమిటంటే.. ఈ బిలియనీర్ల జాబితా నుంచి 95 మంది తప్పుకున్నారు. అంటే.. వాళ్లు పెట్టుబడుల్లో లాభాలు పొందక కొంతమేర ఆస్తిని పోగొట్టుకుని తమ ఆదాయంలో కోత విధించుకున్నారన్నమాట! ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ బిలియనీర్లలో చాలావరకు అమెరికా, చైనాకు చెందివనాళ్లే వున్నారు.

బిల్ గేట్స్ : సంపద :$85 బిలియన్లు (రూ. 5252698250000)

మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ అయిన బిల్ గేట్స్.. గతేడాదితో పోల్చుకుంటే ఇతని సంపద 17% ఎక్కువగా పెరిగినట్లు తెలుస్తోంది. సర్వే లెక్కల ప్రకారం.. బిల్ గేట్స్ తన ఆదాయంలో 25 శాతం మొత్తాన్ని వారెన్ బఫెట్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టగా.. మిగిలింది మైక్రోసాఫ్ట్’లో ఇన్వెస్ట్ చేశాడు. ఇదేకాకుండా ఫేస్ బుక్’లో $3.5 బిలియన్ల పెట్టుబడులు కూడా పెట్టాడు.

bill-gates-news

కార్లోస్ స్లిమ్ హెలూ అండ్ ఫ్యామిలీ : సంపద : $83 బిలియన్లు (రూ. 5131180350000)

టెల్ మెక్స్ అండ్ అమెరికా మోవిల్ వంటి టెలికమ్యూనికేషన్ కంపెనీలకు ఛైర్ పర్సన్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన ఈయన.. బిల్ గేట్స్ తర్వాత రెండో స్థానాన్ని సాధించాడు. గతేడాదితో పోల్చుకుంటే ఇతని సంపద 38% పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి.

Carlos-Slim-Helu

వారెన్ బఫెట్ : సంపద $76 బిలియన్లు (రూ.4698354200000)

ప్రముఖ దిగ్గజ కంపెనీ బర్క్’షైర్ హాథ్వేకి ఛైర్మన్ & సీఈఓ అయిన ఈయన.. తన సంపదను ఈ ఏడాదిలో $12 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చేసుకోగలిగాడు. ఇతడు బిల్ అండ్ మెలిండా గేట్స్ అనే ఫౌండేషన్’కు $2.8 బిలియన్ దానం చేశాడు.

warren-buffet

అమాన్షియో ఓర్టెగా (Amancio Ortega) : సంపద : $55 బిలియన్లు (రూ.3400509750000)

ఇండిటెక్స్ ఫ్యాషన్ గ్రూప్’కి ఛైర్మన్ అయిన ఈయన.. చైన్ ఆఫ్ జరా దుస్తుల్లో పేరుగాంచిన వ్యక్తి. అయితే.. ఈ ఏడాదిలో ఇతని సంపద 11% తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి.

Amancio-Ortega

ల్యారీ ఎలిసన్ : సంపద : $54 బిలియన్లు (రూ.3337740000000)

ఈయన ఒరాకిల్ కోఆపరేషన్ సంస్థకు చీఫ్ టెక్నాలజీ ఆఫసర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్’గా విధులు నిర్వహిస్తున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఇతని సంపద 13% పెరిగింది.

Larry-Ellison

బెర్నార్డ్ ఆర్నాల్ట్ : సంపద : $45 బిలియన్లు (రూ. 2782347750000)

ఈయన LVMH అనే కంపెనీకి 1989 నుంచి ఇప్పటివరకు ఛైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్’గా విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది కంటే ఈసారి ఈయన సంపద 2% మేర తగ్గినట్లు సర్వే తెలిపింది.

Bernard-Arnault

మార్క్ జూకర్ బర్గ్ : సంపద : $44 బిలియన్లు (రూ. 2720275800000)

ఫేస్ బుక్ రూపకర్త అయిన ఈ యువకుడు.. టాప్ టెన్ ధనికుల జాబితాలో చోటు సంపాదించిన అత్యంత చిన్న వయస్కుడు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఇతను.. ఎన్నో రోజులవరకు కష్టపడి ఫేస్ బుక’ని రూపొందించి.. నేడు బిలియనీర్ల జాబితాలో స్థానం సాధించాడు. గతేడాదితో పోల్చుకుంటే మార్క్ ఈ ఏడాది తన సంపదలో 42% శాతం పెంచుకోగలిగాడు.

mark-zuckerberg-news

ఛార్లెస్ కోచ్ & డేవిడ్ కోచ్ : సంపద : $36 బిలియన్లు (రూ. 2225680200000)

ఈ అన్నాదమ్ములిద్దరూ కోచ్ అనే పేరిట ఎన్నో ఇండస్ట్రీస్’ని నిర్వహించారు. వాటి ద్వారా సంపాదించిన మొత్తంతో వీళ్లు బిలయనీర్లుగా అవతారమెత్తారు.

Charles-Koch-David-Koch

డైటర్ స్క్వార్జ్ : $36 బిలియన్లు (రూ. 2225680200000)

స్క్వార్జ్ గ్రూప్’ను స్వతహాగా నిర్మించి ఓనర్ గా చెలామణి అవుతున్న ఈ బిజినెస్ మేన్.. గతేడాదికంటే ఈ ఏడాదిలో తన సంపదను 29% మేర మెరుగుపర్చుకున్నాడు.

Dieter-Schwarz

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : the hurun global rich list 2015  worlds richest people 2015  bill gates  

Other Articles