Akshay kumars baby banned

akshay kumar baby movie, akshay kumar latest movie news, akshay kumar baby movie ban, bollywood baby movie news, bollywood baby movie, rana daggubati baby movie, rana daggubati latest news, bollywood baby movie review, baby movie news, tapsee pannu news, tapsee pannu latest news, tapsee pannu hot photos, baby movie pakistan ban, pakistan country, pakistan baby movie, anupam kher news

Akshay Kumar’s espionage thriller Baby, which centres round an Indian spy’s mission to capture a terrorist from a West Asian nation, has been banned in Pakistan for its "negative" portrayal of Muslims.

అక్షయ్ కుమార్ ‘బేబి’ బ్యాన్..! బ్యాన్..!!

Posted: 01/23/2015 04:50 PM IST
Akshay kumars baby banned

ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గూడాచారిగా నటించిన చిత్రం బేబి ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా పలు ధియేటర్లలో విడుదలైంది. అయితే ఈ చిత్రాన్ని పాకిస్థాన్ సెన్సార్ బోర్డు మాత్రం బ్యాన్ చేసింది. భారతీయ గూడాచారి అధికారి పాత్రను పోసించిన అక్షయ్ కుమార్ పశ్చిమాసియాలో దాగుని వున్న ఓ ఉగ్రవాదిని పట్టుకునే ఆపరేషన్ కథాంశంతో నిర్మించిన ఈ చిత్రాన్ని దాయాది దేశం పాకిస్థాన్ నిషేధించింది. మహ్మదీయుల మనోభావాలను ఈ చిత్రంలో గాయపర్చారన్న కారణంగా బేబి చిత్రాన్ని నిలిపివేస్తున్నారు.

ఈ చిత్రంలో ముస్లింల మనోభావాలను దెబ్బతీశారని, ముస్లిలందరు ఉగ్రవాదులని సినిమాలో ఓ తప్పుడు ప్రచారం చేశారని, అంతేకాకుండా ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఇళ్లలా మారిందంటూ అర్థం వచ్చేలా పలు సినిమా డైలాగులు వున్నాయని పాకిస్థాన్ సెన్సార్ బోర్డు చైర్మన్ ఫఖ్రీ అలామ్ ట్విట్టర్ లో పోస్టు చేశాడు. ఈ చిత్రాన్ని ఎన్ని కత్తెరలు పెట్టినా.. నిడివి మొత్తంలో పాకిస్థాన్ ను దోషిగా చేయడం, ముస్లింలను ఉగ్రవాదులులా చూపూతునే వున్నారని. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని బ్యాన్ చేశామని ఫక్రీ ట్విట్ చేశాడు.

పాకిస్థాన్ చిత్ర పంఫిణీదారుడు ఎవర్ రెడీ పిక్చర్స్ అధినేత ఇస్లామాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. బేబి చిత్రాన్ని పాకిస్థాన్ లోని రెండు అతిపెద్ద చిత్రమార్కెట్ల ఇస్లామాబాద్, సింద్ ప్రావిన్స్ లలో నిషేధించారని తెలిపారు. కాగా, చిత్ర దర్శకుడు నీరజ్ పాండే మాత్రం ఈ చిత్రం పాకిస్థాన్ కు వ్యతిరేకంగా వుందన్న వార్తలను తోసిపుచ్చారు. ఈ చిత్రంలో ముగ్గురు పాకిస్థాన్ నటులు కీలక పాత్రల్లో నటించారని తెలిపారు. దేశంలోని కొన్ని అంశాలకు తప్పుగా వుండవచ్చు కానీ దేశమే తప్పగా వుందని అనడం తప్పిదమేనన్నారు. ఉగ్రవాదానికి మతం లేదని, మతం వేరు, దేశం వేరని పాండే అన్నారు.

దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ విడుదలైన బేబి చిత్రం పాకిస్థాన్ లో మాత్రం రిలీజ్ కు నోచుకోలేదు. హైడర్, ఎక్ థా టైగర్ , ఏజుంట్ వినోద్ తరువాత బేబి చిత్రాన్ని కూడా పాకిస్తాన్ సెన్సార్ బోర్డు నిషేదించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akshay kumar  movie baby  bollywood  pakistan  

Other Articles