Lakshmi parvathi praises and criticisms chandrababu

Lakshmi Parvathi, Lakshmi Parvathi praised Chandrababu, Lakshmi Parvathi criticism Chandrababu, Lakshmi Parvathi Criticize chandrababu, IT developement in Andhra Pradesh, Information Technology in Andhra Pradesh, I T companies in Hyderabad, Telangana government on Software developement, telangana latest updates, Bharat Ratna for NTR, NTR Family

Lakshmi Parvathi praises and criticisms Chandrababu : YSR Congress Leader and great leader NTR wife Lakshmi Parvathi praised Chandrababu Naidu for Information Technology introduction in Andhra Pradesh. Laxmi Parvathi criticism AP CM for not developing and expanding IT sector in state

ఎన్టీఆర్ పేరు చెప్పి నోరు మూయించింది

Posted: 01/20/2015 09:52 AM IST
Lakshmi parvathi praises and criticisms chandrababu

లక్ష్మి పార్వతి గురించి తెలియని తెలుగు వారుండరు. ఎన్టీఆర్ భార్యగా, తరుచుగా, బాబుపై విమర్శలు గుప్పించే వ్యక్తిగా పార్వతి బాగా పాపులర్ అయ్యారు. రామారావు గారితో కొద్దికాలమే వివాహ బంధం కొనసాగినా.., ఇప్పటికీ, ఎప్పటికీ నాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ కాలం గడుపుతున్నారామె. ఇలా జీవితమంతా ఎన్టీఆర్ పేరుతో కాలం వెల్లదీస్తున్న లక్ష్మి పార్వతి తనపై ఏ చిన్న విమర్శ వచ్చినా ఎన్టీఆర్ కు అవమానం జరిగిపోయిందన్నట్లు నానా రచ్చ చేస్తున్నారు.

తాజాగా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో లక్ష్మి పార్వతిపై ఓ టీడీపీ నేత విమర్శలు చేయటానికి ప్రయత్నించారు. పసుపు తమ్ముడు మాట మొదలు పెట్టకముందే ‘నేను ఎన్టార్ భార్యను. నన్ను గౌరవించటం నేర్చుకొండి’ అని అవతలి వైపు నుంచి కౌంటర్ వచ్చింది. అంతే, వెంటనే ఆయన నోరు మూత పడింది. ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రేక్షకులు ఎన్టీఆర్ భార్య అయితే విమర్శించకూడదా అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతలకు వ్యవస్థాపకుడిపై గౌరవం ఉంటే కాదనలేము తప్ప.., ఆయన కుటుంబ సభ్యులపై కూడా నోరెత్తలేని ప్రేమ, భయం ఉంటే సరికాదని అంటున్నారు.

ఈ ఇంటర్వ్యూలో మరో విచిత్రం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బాబును తిట్టమన్నా, విసుక్కోకుండా.. ఓపిగ్గా విమర్శల దండకం చదివే పార్వతి గారు తొలిసారి బాబును మెచ్చుకున్నారు. ఓ పది సెకన్ల పాటు ఆమె మాటలు చంద్రన్నకు అనుకూలంగా పలికాయి. ఏపీకి ఐటీ రంగాన్ని తీసుకొచ్చింది చంద్రబాబే అని మహిళా నేత అంగీకరించారు. ఈ కామెంట్ చేసిన వెంటనే, ఐటి విస్తరణలో బాబు విఫలం అయ్యారు అని కౌంటర్ కూడా ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lakshmi Parvathi  NTR  Chandrababu  

Other Articles