Ncw former chief mamata sharma allegations on modi

Mamata Sharma on modi, Mamata Sharma allegations on modi, Mamata Sharma on NCW, Mamata Sharma latest, NCW latest news, NCW committee, NCW address, national commission for women, Modi on Women security

NCW former Chief Mamata Sharma allegations on Modi : National Commission for Women former cheif Mamata Sharma says NCW paralysed in modi government. Now NCW is not working like my tenure its isolated in NDA period says mamata

మోడీ వల్ల మాకు పక్షవాతం వచ్చింది !

Posted: 01/20/2015 09:26 AM IST
Ncw former chief mamata sharma allegations on modi

ప్రధాని నరేంద్రమోడీ పనితీరుపై జాతీయ మహిళా కమిసన్ మాజీ చైర్ పర్సన్ మమతా శర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా కమిషన్ పనితీరు తగ్గిందన్నారు. గతంలో ఎన్నో కేసులను పరిష్కరించి, ఎందరో నిందితులని అరెస్టు చేయించిన కమిసన్ ఇప్పుడు నామమాత్రపు సంఘంగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మహిళా కమిషన్ కు పక్షవాతం వచ్చినట్లుగా మారిందని ద్వజమెత్తారు.

ప్రస్తుతం కమిషన్ ఎడారిని తలపిస్తోందన్నారు. ఫిర్యాదులు తీసుకోవటానికి అక్కడ ఎవరూ ఉండరని, ఆఫీసుకు ఎవరు ఎప్పుడు వస్తారో తెలియని దుస్థితి నెలకొందన్నారు. ’నా హయాంలో అయితే మహిళల భద్రత, అభివృద్ధి కోసం దేశ వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. అవగాహనా సదస్సులు నిర్వహించాము’ అని మమతా చెప్పుకొచ్చారు. ఏరోజు ఫిర్యాదులపై ఆ రోజే స్పందించి వివరణ కోరేవారమని చెప్పారు. కానీ ప్రస్తుత కమిషన్ పనితీరు అలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోడి ఇలా ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావటం లేదని మమతా శర్మ అన్నారు. మహిళా భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పే ప్రభుత్వంపై మమత చేసిన విమర్శలకు ఎవరు ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mamata Sharma  NCW  Modi government  

Other Articles