Kcr s brother daughter joins congress

ramya, k chandrasekhar rao, telangana, trs, congress, ramoji film city, telangana chief minister KCR, TRS party president KCR, kcr brothers daughter Ramya joins congress, kcr niece ramya joins congress, ramya joins congress, kcr s brother daughter joins congress, kcr niece joins congress,

telangana chief minister KCR brothers daughter ramya joins congress party

కాక పార్టీ వదట.. అందుకనే ఈ పార్టీలో చేరిందట..

Posted: 01/16/2015 09:47 PM IST
Kcr s brother daughter joins congress

అమె స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమార్తె. అయినా తన కాక కేసీఆర్ కుటుంబ పాలన తో విరక్తి చెందిన ఆమె నేరుగా జాతీయ పార్టీ కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం రమ్య మీడియాతో మాట్లాడుతూ. చిన్నాన్న కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ అభద్రతా భావంతో ఉన్నారని, అందుకే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు.

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు. రాష్ట్ర మంత్రి హరీశ్ రావుకు పొన్నాల లక్ష్మయ్యను విమర్శించే స్థాయిలేదన్నారు. పొన్నాల చెల్లని రూపాయి అని హరీష్ విమర్శించడాన్ని ఆమె ఖండించారు.కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఉద్యమకారుని తరహాలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మీడియాను పాతర వేస్తానని అనడం ఎంతవరకు సమంజసమన్నారు. రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్ళతో దున్నిస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని ఆమె చెప్పారు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramya  k chandrasekhar rao  telangana  trs  congress  

Other Articles