I movie producer stucks another time in financial problems

I movie news, I movie producer, I movie controversies, I movie financial problems, I movie producer aascar ravi chandran, director shankar, chiyan vikram news, ar rehman news, i movie release date, i movie release, i movie collections, i movie records, amy jackson news

i movie producer stucks another time in financial problems : I movie producer aascar ravichandran stills stucks in financial problems.

‘ఐ’య్యయ్యో.. ఇంకా సమస్యలు తీరలేదట!

Posted: 01/10/2015 06:48 PM IST
I movie producer stucks another time in financial problems

ఏ ముహూర్తాన ‘ఐ’ చిత్రం షూటింగ్’ని ప్రారంభించారో తెలియదు కానీ.. ఆ మూవీకి సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి నీలినీడలా వెంటాడుతూనే వున్నాయి. మొదటి నుంచి ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ చివరికి జనవరి 14వ తేదీన విడుదలకు సిద్ధంగా వుండగా.. మొన్న అనుకోకుండా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్’లో కూరుకుపోయిన విషయం తెలిసిందే!

ఈ చిత్రాన్ని ఫైనాన్స్ చేసిన పిక్చర్ మీడియా వర్క్స్’కు, నిర్మాతకు మధ్య ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో తలెత్తిన సమస్య నేపథ్యంలో సదరు ఫైనాన్షియర్ తమకు అందాల్సిన మొత్తాన్ని ఇప్పించాల్సిందిగా హైకోర్టుకు ఎక్కాడు. దీంతో కోర్టు చిత్రాన్ని జనవరి 30వ ఆపాల్సిందిగా జారీ చేసింది. అయితే కోర్టు వెలుపలే ఈ వ్యవహారంపై నిర్మాత వారితో రాజీని రావడంతో ఆ సమస్య పరిష్కారమైంది.

కానీ.. ఇప్పుడు తాజాగా నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ మరోసారి ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయాడని సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దర్శకుడు శంకర్’కి, హీరో విక్రంకి, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్’కి కూడా పారితోషికాల పరంగా ఇంక కొంతమేరకు బాకీ వున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి సమస్యను తీర్చే పనిలోనే నిర్మాత వున్నట్లు చెన్నయ్ వర్గాల సమాచారం!

అయితే.. తమకు పారితోషికం ఇవ్వలేదన్న నెపంతో ఆ ముగ్గురు ఈ చిత్రాన్ని నిలిపివేసే ప్రయత్నాలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయలేరు కాబట్టి.. ఈ మూవీ విడుదలకు ఎటువండి ఇబ్బందులు లేవు. పైగా ఎన్నాళ్లనుంచో వేచిచూస్తున్న నిరీక్షణకు వాళ్లు అడ్డుకట్ట వేసే ప్రసక్తే లేదు. కానీ.. నిర్మాత వారి డబ్బులు ఎలాగోలా ఇచ్చేయాలని తగిన పరిష్కారాన్ని చూసుకుంటున్నాడని న్యూస్!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : I movie problems  aascar ravi chandran  chiyaan vikram  amy jackson news  

Other Articles