Ys jagan mohan reddy on babu

Ys Jagan on babu, Ys Jagan on cm post, Ys Jagan on cm, Ys Jagan dream on cm, Ys Jagan assets case, Ys Jagan case, Ys Jagan assets list, andhra pradesh land allocations, andhra pradesh capital issues, andhra pradesh government updates

Ys Jagan Mohan Reddy on Babu : YSR Congress President Jaganmohan Reddy says babu ruling will end by 2017 after that his ruling will come. Astrologists and pandits saying that babu government going to falldown by 2017 says Jagan

ఏవండోయ్ ఇది విన్నారా...?

Posted: 01/06/2015 08:02 AM IST
Ys jagan mohan reddy on babu

చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా.., ప్రతిపక్ష నేతగా ఉన్నా, జగన్ కు మాత్రం సీఎం సీటుపై కోరిక మాత్రం తగ్గలేదు. ఎప్పుడు సమయం వచ్చినా నేను సీఎం అయితే బాగుండు అని సారు కలలు కంటున్నారు. ఎప్పుడెప్పుడు సీఎం అవుతానా అని జ్యోతిష్యులను కూడా సంప్రదిస్తున్నారట. పండితులు కూడా కాస్త పాజిటివ్ గా చెప్పటంతో, గ్రహాలన్నీ తననే అనుగ్రహిస్తున్నాయని ఆనంద పడుతున్నారు. తన సంతోషాన్ని ప్రజలతో పంచుకుంటున్నారు. బాబు గేమ్ రెండు సంవత్సరాల్లో  ఓవర్ అవుతుందని జగన్ జోస్యం చెప్తున్నారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన ఏపీ ప్రతిపక్ష నేత, అధికారం ఉందికదా అని బాబు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని ద్వజమెత్తారు. అంతేకాకుండా దేవుడు అనుగ్రహిస్తే నాలుగేళ్లు ఉండవచ్చు. కానీ ఈ లోపే సర్కారు కుప్పకూలుతుందని జ్యోతిష్కులు చెప్తున్నారని తెలిపారు. అంతటితో ఆగకుండా ఒక అడుగు ముందుకు వేసి జగనే సీఎం అయితే చేసే పనేమిటో కూడా చెప్పారు. బాబు చేసే అక్రమాలను బయటకు తీసుకువస్తామన్నారు. బలవంతంగా లాక్కున్న భూములను తిరిగి అప్పగిస్తామన్నారు. మీ కొడుకుగా, అన్నగా, తమ్ముడిగా, మనవడిగా ముఖ్యమంత్రిని అవుతాను. అందరికి న్యాయం చేస్తాను అని చెప్పాడు. అయితే సారు చేసేది సామాజిక న్యాయమూ, సమ న్యాయమూ అనేది మాత్రం చెప్పలేదు.., బహుశా ఇది జ్యోతిష్కుడు చెప్పలేదేమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ys Jagan  chandrababu  andhra pradesh updates  

Other Articles