Petrol and dissel prices cut by rs 2 per litre

petrol, Diesel, Fuel, Omc, petrol prices, diesel prices, petroleum ministry, NDA government, deregulation, Fuel price, fuel price cut, Petrol price per litre, IOC, crude oil prices, international oil markets, barrel crude oil price, barrel crude oil prices in indian currency

Diesel & petrol prices cut down by Rs. 2 per litre as crude oil pices decreased to 55 american dollars

లీటర్ పై రూ.2 మేర తగ్గిన ఇంధన ధరలు

Posted: 01/01/2015 06:31 PM IST
Petrol and dissel prices cut by rs 2 per litre

గత ఏడాది ఆరంభంలో పైపైకి ఎగబాకిన ఇంధన ధరలు.. క్రమంగా గత ఆగస్టు నుంచి నేలకు దిగిరావడంతో వాహనదారులు సంతోషాలకు అవధులు లేవు. వీటికి తోడు డీజిల్ ధరలు కూడా తగ్గడంతో వాహనదారులందరి జేబులు నిండుగానే వుంటున్నాయి. గత ఏడాది జూలై మాసంలో ఎనభై రూపాయలు పలికిన పెట్రోల్ ధర క్రమంగా దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర భారీగా పతనం కావడంతో ఇంధన ధరలు భారగా తగ్గుతున్నాయి. బ్యారల్ క్రూడ్ ఆయిల్ ధర 55 డాల్లర్లకు తగ్గిపోయింది. దీంతో దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలను రూ. 2 మేర తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది.

న్యూఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 50.51, ముంబైలో రూ. 57.91గా ఉంది. గతేడాది డిసెంబర్ 15వ తేదీన లీటర్ డీజిల్, పెట్రోల్పై రూ. 2 మేర ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. అలాగే సబ్సీడీయేతర ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 43.50 మేర తగ్గిస్తున్నట్లు తెలిపింది. దాంతో 14.2 కేజీల సిలిండర్ ధర న్యూఢిల్లీలో రూ. 708 ఉండగా,  ముంబైలో రూ. 725.50గా ఉంది. పెరిగిన ధరలు ఇవాళ అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

గతంలో 110 పై చిలుకు అమెరికన్ డాలర్లు పలికిన క్రూడ్ అయిల్ ధర ప్రస్తుతం సగానికి చేరుకుంది. అయితే క్రూడ్ అయిల్ ధర అత్యధిక స్థాయికి చేరిన సందర్భంలో.. హైదరాబాద్ లో సుమారు ఎనభై రూపాయల వరకు పలికిన పెట్రోల్ దర.. ఇప్పు గణనీయంగా తగ్గనుంది. అయితే క్రూడ్ అయిల్ తగ్గింపు ధరలతో పోల్చుకుంటే.. ఆశించిన మేరకు తగ్గడం లేదు. ఇంధన ధరల నియంత్రణపై కేంద్రం చేతులెత్తిసిన తరుణంలో ఈ పరిణామాం శుభసూచకమే

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  Diesel  Fuel  Omc  Petrol price per litre  IOC  Crude oil  LPG  

Other Articles