Nara lokesh to contest next mla elections

Nara Lokesh, Nara Lokesh on Assembly Elections, Nara Lokesh krishna district tour, Nara Lokesh in Machilipatnam, Nara Lokesh on Assembly contesting, Nara Lokesh on MLA contesting, Nara Lokesh on Venkataramana family ticket, tirupati tdp mla ticket, Nara Lokesh latest comments, Nara Lokesh on jagan, Nara Lokesh on trs, Nara Lokesh brahmani, Nara Lokesh family, TDP latest, TDP updates, Andhra Pradesh news, 2019 Assembly Elections

Nara Lokesh to contest next MLA elections : TDP Leader Nara Lokesh says if all works and god blesses he will contest 2019 Assembly Elections. Nara Lokesh hints about his Assembly entry says that may be contest in 2019 elections with god grace. tirupati MLA Venkataramana ticket will be given to his family members says Nara Lokesh

దేవుళ్ళను తికమకపెడుతున్న లోకేష్ బాబు

Posted: 12/30/2014 07:32 AM IST
Nara lokesh to contest next mla elections

సోమవారం రోజు (డిసెంబర్ 29, 2015) కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ యాసిడ్ బాధితురాలిని పరామర్శించారు. బాధితురాలికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేష్ బాబు.., ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుడి అనుగ్రహం ఉంటే 2019 ఎన్నికల్లో పోటి చేస్తానని చెప్పారు. అప్పటిదాకా ఎందుకాలస్యం.., తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో ఖాళీ అయిన స్థానంలో పోటి చేయవచ్చు కదా అంటే.., ఎమ్మెల్యేలు చనిపోతే వారి కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చే సాంప్రదాయం పార్టీలో ఉందని చెప్పారు. కాబట్టి 2019 వరకు ఆగక తప్పదని చెప్పారు.

దేవుడి దయ అన్నారు కానీ.. ఏ దేవుడి దయనో మాత్రం లోకేష్ చెప్పలేదు. ఎందుకంటే టీడీపీ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఉంది. ఒక రాష్ర్టంలో అధికారంలో మరో రాష్ర్టంలో ప్రతిపక్షంలో కొనసాగుతోంది. తాను ఏపీకి చెందినవాడిని కాదు., తెలంగాణకు చెందిన వాడినీ కాదు.., హైదరాబాదిని అంటే అందరి వాడిని అని గతంలో చాలాసార్లు బాబు చెప్పారని గుర్తు. మరి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ బిడ్డగా బరిలోకి దిగుతాడా లేక.., ఏపీ సీఎం తనయుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో పోటి చేస్తాడా క్లారిటీ ఇవ్వలేదు. ఏపీలో పోటి చేయాలంటే తిరుపతి వెంకన్న దయ కావాలి.., తెలంగాణలో పోటి చేయాలంటే యాదగిరి లక్ష్మి నరసింహుడి అనుగ్రహం ఉండాలి. ఎక్కడ పోటీ చేస్తాడో చెప్పకపోవటంతో.., ఎవరు అనుగ్రహించి, ఆశీర్వదించాలో తెలియక దేవుళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Lokesh  Assembly Elections  Andhra Pradesh Latest  

Other Articles