Bangalore bomb blast a terror attack says union government

Bangalore Bomb Blast Terror Attack, terror attack says Union Government, karnataka chief minister siddaramaiah, Bangalore Bomb Blast case handed over to NIA, NIA investigation is on, Union government, junior home minister kiren rijijju, union home minister Rajnath singh, National Investigation Agency

Bangalore Bomb Blast a Terror Attack, Says Union Government and hand overs the case to national investigation agency

బాంబుదాడి ఖచ్చితంగా ఉగ్రవాదుల పనే..

Posted: 12/29/2014 03:29 PM IST
Bangalore bomb blast a terror attack says union government

కర్ణాటకలో రాజధాని బెంగళూరు నగర నడిబొడ్డున పేలిన బాంబు విస్పోటనం వెనుక తీవ్రవాదుల హస్తం వుందని స్పష్టం చేసింది. ఆ దాడి ఖచ్చితంగా ఉగ్రవాదులు చేసిందేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రాజిజ్జు అన్నారు. అయితే ఆ బాంబు దాడి ప్రభావం తక్కువ ఉండటంతో పెద్దగా ప్రాణం నష్టం జరగలేదన్నారు. ఆ దాడి వెనుక సిమి (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా) ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.  ప్రస్తుతం ఆ కోణంలోనే దర్యాప్తు సాగుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

అటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా బాంబు దాడి ఉగ్రవాదుల పనేనన్నారు. బెంగుళూరులోని ఓ రెస్టారెంట్ వద్ద సంభవించిన బాంబు పేలుడు ఘటనలో ఓ మహిళ మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని వారు తెలిపారు. ఇది ఖచ్చితంగా తీవ్రవాదుల పనేనని వారు ఆరోపించారు. కాగా బాంబు తీవ్రత తక్కువైనా అత్యంత ఆదునీక పరికరాలతో బాంబును తయారు చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. కాగా బాంబు దాడికి పాల్పడింది తామేనని ఇప్పటి వరకు ఎ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. బెంగుళూరు బాంబు పేలుడు ఘటనను దేశ ఉద్రవాద వ్యతిరేక దళం జాతీయ దర్యాప్తు బృందానికి అప్పగిస్తున్నట్లు కేంద్ర హోం శాకా మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ప్రతి వారంతంలో ముఖ్యంగా ఆదివారాల్లో జనంతో నిండుగా వుండే రెస్టారెంటును తమ లక్ష్యంగా ఎంచుకుని తీవ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ఆయన అన్నారు. రాష్ట్రంలోని అన్ని ముఖ్య ప్రాంతాల్లో సిసీటీవీలను ఏర్పాటు చేయాలని తాను కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు చెప్పారు.

బాంబు పేలుళ్ల కేసును అవసరమైతే ఎన్ఐఏకి అప్పగిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. బాంబు పేలుడు ఘటనపై జాతీయ భద్రతా సలహాదారు, ఐటీ చీఫ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శితో ఆయన సమీక్ష నిర్వహించారు. బెంగళూరులోని కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని కర్ణాటక ప్రభుత్వానికి రాజ్‌నాథ్ సూచించారు. మరోవైపు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ఈ పేలుడు తీవ్రవాదుల దుశ్చర్యేనని అభిప్రాయపడ్డారు. కర్ణాటక ప్రభుత్వానికి కావాల్సిన సాయాన్ని కేంద్రం అందించేందుకు సిద్దంగా వుందని చెప్పారు.

బాంబు దాడితో తాము బెంగుళూరు నగరవ్యాప్తంగా అలెర్ట్ ప్రకటించామని నగర పోలీస్ కమీషనర్ ఎంఎన్ రెడ్డి చెప్పారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకోనున్న సందర్భంగా తాము నగరమంతా కట్టుదిట్టమైన  భద్రతను ఏర్పాటు  చేసినట్లు చెప్పారు.  ముందస్తు జాగ్రత్త చర్యగా తనిఖీలను చేపట్టామన్నారు. నగర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకుండా పెట్రలింగ్ బృందాలను విస్తృతపర్చామని తెలిపారు. కాగా, నూతన సంవత్సర సమయంలో ఇలాంటి దాడులు జరగడంతో రెస్టారెంట్లు, బెకరీలు యజమానులకు పోలీసులు పలు ఆంక్షాలను విధించే అవకాశముందని తెలుస్తోంది. కొత్త సంవత్సరం వేళ రాత్రి 1గంటలకు అన్ని రెస్టారెంట్లును మూసివేయాలన్న ఆంక్షలు విధించే అవకాశమున్నట్లు సమాచారం. అయితే దీనిపై రెస్టారెంట్ల యాజమాన్యాల నుంచి నిరసన కూడా వ్యక్తమయ్యే అవకాశాలున్నాయి. భారత సాప్ట్ వేర్ హబ్ గా పేరొందిన బెంగళూరులో న్యూ ఇయర్ వేడుకల కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసిన రెస్టారెంట్ల యాజమాన్యాలు ఆంక్షల విధిస్తున్నారన్న కథనాల నేపథ్యంలో ఆందోళన చెందుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangalore Bomb Blast  siddaramaiah  rajnath singh  kiren rijijju  

Other Articles