క్రైస్తవుల దైవం(ప్రభువు) ఏసు క్రీస్తుకు పెళ్లి అయిందన్న వార్త ప్రపంచ క్రైస్తవులను షాక్ కు గురి చేస్తోంది. శాంతిదూత, పాపాల్ని కడిగేసే ప్రభువుకు పెళ్లి జరిగిందన్న వార్తను క్రైస్తవులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు ఇది అసత్యమని చెప్తుంటే.., మరికొందరు దేవుడిపై దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇలా క్రీస్తుకు పెళ్ళి కావటంతో పాటు పిల్లలు ఉన్నారన్న ప్రకటనపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఓ పుస్తకంలో ఉన్న సమాచారం ప్రకారం క్రీస్తుకు పెళ్ళి అయినట్లు తెలుస్తోంది.
లండన్ లోని బ్రిటీష్ లైబ్రరీలో ఉన్న 1500సంవత్సరాల క్రితం నాటి ‘లాస్ట్ గాస్పెల్’ అనే ముద్రితం కాని పుస్తకంలో క్రీస్తుకు పెళ్లి జరిగినట్లు రాయబడింది. పుస్తకంలో ఉన్న సమాచారం ప్రకారం... ఏసు ప్రభువు మేరీ మగ్డాలెనే అనే మహిళను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మేరి అనుకోకుండా వేశ్య వృత్తిలోకి ప్రవేశించి ఆ తర్వాత ఆ కూపం నుంచి బయటపడిందని రాయబడింది. ఇక క్రీస్తు-మేరి దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు డైలీమెయిల్ ఆన్ లైన్ సైట్ తన కధనంలో పేర్కొంది.
అప్పట్లో (1500 సం. క్రితం) వాడుకలో ఉన్న భాషలో ‘లాస్ట్ గాస్పెల్’ ను రాయటం జరిగింది. ఇందులోని సమాచారన్ని ప్రొఫెసర్ బెర్రీ విల్సన్, రచయిత సించా జకోబోవిక్ కలిసి నెలల తరబడి కష్టపడి అందులోని సమాచారాన్ని ప్రస్తుత భాషలోకి అనువదించారు. అలా క్రీస్తుకు పెళ్లి జరిగినట్లు పుస్తకం ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా ‘లాస్ట్ గాస్పెల్’ తో పాటు మిగతా గాస్పెల్ రచనల్లో కూడా మేరి మెగ్డాల్మిన్ గురించి ప్రస్తావించటము, గొప్పగా చెప్పటం జరిగింది. అంటే క్రీస్తుకు సంబంధించిన కధలో ఆమె ప్రస్తావన చాలాకాలం నుంచి ఉంది.
అంతేకాకుండా క్రీస్తుకు పెళ్లి జరిగిందని చెప్పటం ఇదే తొలిసారి కాదు. జీసస్ జీవితంపై వచ్చిన ‘ద డా విన్సి కోడ్’ లో కూడా ఏసుకు మేరీ మెగ్డాల్మెనె తో పెళ్లి జరిగినట్లు చెప్పబడింది. ఇక తాజాగా పెళ్ళి ప్రకటన చేసిన ఈ పుస్తకంను బుధవారం రోజు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆన్ లైన్ లో కూడా ఈ పుస్తకం అమ్మకానికి అందుబాటులో ఉంచుతున్నారు. ఇందులో జీసస్ పెళ్లి, పిల్లల పేర్లు ఇతర సమాచారం ఉంటుందని తెలుస్తోంది. పెళ్లి విషయం ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ.., పుస్తక విడుదల సమయంలోనే ఈ విషయం బయటకు రావటం కేవలం, పెళ్లి ప్రకటన తప్ప పిల్లల పేర్లు ఇతర వివరాలు బయటకు లీక్ చేయలేదు. దీన్నిబట్టి ఇది పుస్తకంకు పబ్లిసిటి పెంచే ఎత్తు అని కొందరు విమర్శిస్తున్నారు.
article courtesy : www.dailymail.co.uk
( నోట్ : ఈ కధనం ఎవరినీ ఉద్దేశించి, వ్యతిరేకంగా రాయబడలేదు. కేవలం ఆన్ లైన్ లో లభించిన సమాచారం ప్రకారం మాత్రమే రాయటం జరిగింది. కాబట్టి ఈ కధనంతో ‘తెలుగు విశేష్’కు ఎలాంటి సంబంధం లేదు. పేర్లలో తప్పిదాలు, సవరణలు ఉంటే మన్నించగలరు.)
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more