China woman pulled out atm machine for not dispensing money

atm machine working process, atm machine hacking, how atm machine gives money, woman pulled atm machine in china, atm transactions limit, china latest news, atm centers in hyderabad, atm centers address

china woman pulled out atm machine for not dispensing money : a woman in china dunguva city went to atm machine located in a mall. she treid so many times for money but machine not dispensed money because of a problem woman got angry and pulled atm macnine out

క్రేజీ !డబ్బులు రాలేదని ఎటీఎంను ఎత్తి పడేసింది !!

Posted: 10/23/2014 08:58 AM IST
China woman pulled out atm machine for not dispensing money

ఎవరైనా ఏటిఎం సెంటర్ కు వెళ్తే ఏం చేస్తారు డబ్బులు తీసుకుంటారు.., లేదంటే బ్యాలెన్స్ చూసుకుని వస్తారు. అదే ఏటిఎం మెషీన్ పనిచేయకపోతే, ఏముంది ఇంకో ఏటిఎం సెంటర్ కు వెళ్తారు. కానీ చైనాలో ఓ అమ్మాయి డబ్బులు రావటం లేదని ఏకంగా ఏటియంను లాగి పడేసింది. ఈనెల 16న జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చైనాలోని డాన్ గువా పట్టణంలో ఓ షాపింగ్ మాల్ లో ఉన్న ఏటీఎంలో డబ్బులు తీసుకునేందుకు ఓ యువతి వచ్చింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా మెషీన్ నుంచి డబ్బులు రాలేదు.

దీంతో యువతికి కోపం వచ్చింది.. డబ్బులు ఇవ్వని మెషీన్ ఎందుకు ఇక్కడ అనుకుని చేతులతో మెషీన్ ను పీకిపారేసింది. మరో ఆశ్చర్యం ఏమిటంటే..., అలా లాగగానే వెంటనే మోషీన్ ఊడి వచ్చేసింది. దీంతో మాల్ లోని వారంతా ఆశ్చర్యంగా ఆమెను చూస్తున్నారు. ఇదేమిటి ఇలా చేస్తుంది అని కొందరు.., అదేమిటి మెషీన్ అలా ఊడి వచ్చింది అని మరికొందరు నోరెళ్లబెట్టారు. ఇక మరికొందరు మాత్రం బిజీగా తమ సెల్ ఫోన్లలో దీన్ని బందించారు. సెక్యురిటీ గార్డులు కూడా ఈమెను ఆపటానికి ప్రయత్నించలేదు.

చివరకు విషయం తెలుసుకున్న పోలిసులు షాపింగ్ మాల్ కు వచ్చి యువతిని అరెస్టు చేశారు. ఎందుకిలా చేశావని ప్రశ్నిస్తే.., ఎన్నిసార్లు ప్రయత్నించినా మెషీన్ నుంచి డబ్బులు రావటం లేదు. అందుకే కోపం వచ్చి ఇలా చేశాను అని చెప్పిందట. ఇలా చేస్తే అయినా.., బ్యాంకువారికి బుద్దివచ్చి మెషీన్లను సరిగా నిర్వహిస్తారు అని వివరణ ఇచ్చింది. మెషీన్ ను పరిశీలించిన బ్యాంకు అధికారులు సాంకేతిక లోపం ఉందని చెప్పారు. అటు పాత మెషీన్ కావటం వల్లే వెంటనే ఊడివచ్చేసింది అని వివరణ ఇచ్చారు. డబ్బులు రాలేదని మెషీన్ ను పీకేసింది. అదే పోలిస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇస్తే తీసుకోకుంటే... ఈ కాలం అమ్మాయిలను ఆపలేం అనే సినిమా డైలాగ్ నిజమే అన్పిస్తుంది.

 

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles