Ambani antilla house covered by plastic due to rain

Ambani Antilla house covered by plastic due to rain, Ambani antilla house, antilla house latest news, ambani house latest news, ambani house covered by plastic, ambani house antilla house, billionaire ambani news, mukesh ambani latest news, reliance news

Ambani Antilla house covered by plastic due to rain

అంబానీ ‘ఆంటిల్లా’ ఇంటిని ప్లాస్టిక్ సర్జరీ చేశారా..?

Posted: 07/05/2014 12:13 PM IST
Ambani antilla house covered by plastic due to rain

(Image source from: Ambani Antilla house covered by plastic due to rain)

ముంబైలోని రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ‘ఆంటిల్లా’ ఇల్లు గురించి తెలియనివారు ఎవ్వరుండరు! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనంగా అది కితాబును దక్కించుకుంది. 27 అంతస్తుల ఎత్తయిన ఈ భవనంలో చెప్పుకోదగ్గ విశేషాత్మక సౌకర్యాలు వున్నాయి. ఇంతవరకూ ఏ బిలియనీర్ నిర్మించలేని ఇంటిని ముకేష్ అంబానీ నిర్మించి... చరిత్రలో ఎవ్వరికీ దక్కని రికార్డును తన ఖాతాలో జమ చేసుకున్నాడు.

ఇప్పుడు తాజాగా ముకేష్ అంబానీ ఇల్లు గురించి కొన్ని వార్తలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో చక్కర్లు కొడుతోంది. అత్యంత ప్రతిష్టాత్మక భవనం అయిన అంబానీ ఇంటికి ప్లాస్టిక్ సర్జరీ చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేసుకుంటున్నారు. ఈ వార్తలపై ఆరాతీస్తే అది నిజమేనని తెలిసింది. దీంతో యావత్తు భారతదేశం మొత్తం ఒక్కసారిగా ఖంగుతింది. ‘‘అంబానీ ఇంటికి ప్లాస్టిక్ సర్జరీ చేయడమేంటి..?’’ అని జనాలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ముంబైలో వర్షాలు కుండపోతగా కురవడం వల్ల అంబానీ ఇల్లు ఆంటిల్లాను ప్లాస్టిక్ షీట్లతో కప్పేశారని తాజా సమాచారం! వానలు భారీగా కురవడం వల్ల నీరు ఇంట్లోకి వస్తున్న కారణంగా ఇలా ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు పేదజనాల ఇళ్లు ఈ వర్షం ధాటికి కూలిపోతుంటే... మరోవైపు అంబానీ తన ఇంటిని 4 కిలోమీటర్ల పొడవైన షీట్లను ఉపయోగించాడని అందరూ చెప్పుకుంటున్నారు.

భారతదేశంలో అత్యంత ఆస్తిపరుడైన అంబానీ కూడా ప్రకృతి ముందు నిలబడలేక తన ఇంటిని కాపాడుకోవడానికి ఇటువంటి ప్లాస్టిక్ సర్జరీ ట్రిక్కులు ప్లే చేస్తున్నాడని జనాలు కామెంట్లు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రకృతి ప్రభావం అటువంటిది మరీ!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles