Cm kcr review over loan waiver

CM kcr review over loan waiver, telangana cm kcr, , telangana, TRS, KCR, loan waiver, telangana formers, 2014 eleciton.

CM kcr review over loan waiver

కేసిఆర్ రుణం తీరేనా?

Posted: 06/21/2014 09:50 AM IST
Cm kcr review over loan waiver

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావురుణం తీరేనా?అని ఇప్పుడు తెలంగాణ రైతులు అడుగుతున్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ రైతులకు రుణమాపీ చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది. అయితే ముఖ్యమంత్రి పదవి చేపట్టి కేసిఆర్ వెంటనే రైతుల రుణమాపీ పై మొదట తప్పడడుడు వేయటం జరిదింది. దీంతో తెలంగాణ రైతుల నుండి పూర్తి వ్యతిరేకత రావటంతో కేసిఆర్ సర్కార్ షాక్ తిన్నది.

దీంతో కేసిఆర్ రంగంలోకి దిగి.. రైతుల రుణమాపీ త్వరలో ఉంటుందని హామీ ఇవ్వటంతో.. తెలంగాణ రైతులు చల్లబడ్డారు. సిఎం కేసిఆర్ సర్కార్ ప్రభుత్వ అధికారులతో, ఆర్థిక శాఖ అధికారులతో కసరత్తు మొదలుపెట్టి ఒక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రైతుల రుణామాపీ విషయం పై ఎలాంటి ఆందోళన చెందవద్దని, బంగారం తాకట్టు రుణాలు , పాత బకాయిలూ అన్ని రుణా మాపీ చేస్తామని తెలంగాణ ప్రజలకు, రైతులకు భరోసా ఇచ్చింది. దీంతో కేసిఆర్ సర్కార్ పై 18,000 కోట్ల రూపాయల భారం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు లెక్కలు తెల్చారు.

తెలంగాణ రైతులకిచ్చిన హామీ మేరకు రుణ మాఫీ అమలుపై రాష్ర్ట ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఎలాంటి షరతులు లేకుండా లక్షలోపు రుణాలను మాఫీ చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని వారం రోజుల్లోనే కేబినెట్‌లో ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. రుణ మాఫీకి ఎలాంటి షరతులు విధించబోమని ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంటే మరో వారం రోజుల్లో తెలంగాణ రైతుల్లో ఆనందం నిండపోతుంది. దీంతో సీఎం కేసిఆర్ రుణం ఎలా తీర్చుకోవాలని తెలంగాణ రైతులు ఆలోచిస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles