Ys jagan uncle ravindranath reddy over action in assembly

YSRCP Mla Ravindranath Reddy,jagan uncle ravindranath reddy over action, mla ravindranath reddy over action in assembly, ap assembly, ysr, ys vijayamma, ys jagan unlce controvercy.

ys jagan uncle ravindranath reddy over action in assembly

బాబు సభలో అతి చేసిన జగన్ మేనమామ?

Posted: 06/20/2014 07:17 PM IST
Ys jagan uncle ravindranath reddy over action in assembly

ఈరోజు ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ లో కొన్ని విచిత్రాలు జరిగాయి. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ కనివిని ఎరుగని విచిత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సహజంగా తడబాటు పడ్డారు. వీరు కాకుండా సభలో చాలా మంది ఎమ్మెల్యేలకు కొత్త కావటంతో.. కొంచెం తడబాటలు..కొన్ని తప్పులు చేశారు. సీమాంద్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాలో పూర్తి సీట్లు గెలుకున్న విషయం తెలిసిందే.

అయితే కడప జిల్లా నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు అందరు .. వైఎస్ జగన్మోహణ్ రెడ్డి చాలా దగ్గర బంధువులు. కానీ చంద్రబాబు సభలో మాత్రం అలా కాదు. జగన్, ఆయన బంధువులకు మించిన తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే బాబు సభలో .. రెండు పార్టీలే ఉన్నాయి. చిన్న చితక పార్టీలో అసలు లేవు. మూడు పార్టీ అయిన కాంగ్రెస్ .. వాచ్ డాగ్ పాత్ర పోషిస్తుంది. ఈ 5 సంవత్సరాలు పార్టీ ఆఫీస్సులకు బుజుపట్టకుండా జాగ్రత్త పడటమే సీమాంద్ర కాంగ్రెస్ నేతల పని.

అయితే మొదటి రోజు అసెంబ్లీకి డుమ్మా కొట్టిన జగన్ మేనమామ, వైఎస్ విజయమ్మ కి తమ్ముడైన రవీంద్రానాద్ రెడ్డి. ఈరోజు రవీంద్రానాధ్ రెడ్డి ఎట్టకేలకు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే బాబు సభలో చాలా అతి చేయటం జరిగింది. కడప జిల్లా కమలాపురం నుంచి ఎన్నికైన రవీంద్రనాధ్ రెడ్డి అసెంబ్లీలో రెండుసార్లు ప్రమాణం చేయాల్సి వచ్చింది. దీనికి కారణం కూడా ఆయనగారి అతి కారణమని రాజకీమ నేతలు అంటున్నారు.

శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆత్మసాక్షిగా.. లేదా దైవసాక్షిగా ప్రమాణం చెయ్యాలి. లేకుంటే నిబంధనల ప్రకారం అది చెల్లదు. కాగా రవీంధ్రనాథ్ రెడ్డి మాత్రం తన ప్రమాణం సమయంలో తన ‘‘బావ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సాక్షిగా, తన సోదరి విజయలక్ష్మి సాక్షిగా అంటూ ప్రమాణం’’ చేశారు. అయితే దీనిని పరిశీలించిన అధికారులు ప్రమాణం చెల్లదని.. మరోసారి ప్రమాణ దైవసాక్షిగా స్వీకారం చేయించాలని సూచించారు. ఇది కేవలం ఆయన చేసిన ఓవర్ యాక్షన్ అని అర్ధమవుతూనే ఉంది. రవీంద్రనాధ్ ఈ ఒక్క విషయమేమీ కాదు ఏది చేసినా చినిగి కట్టతెగిన చెరువు కావాల్సిందే. అది ఆయన స్టైల్.

ఇక్కడ జగన్ సైతం దైవ సాక్షిగా ప్రమాణం చేయగా.. రవీంద్రానాధ్ రెడ్డి మాత్రం వైఎస్, విజయమ్మ సాక్షిగా ప్రమాణం చేయడం మరీ ఓవర్ అతిగా సభలోని వారికి అనిపించింది. అబ్బాయికి రాని ఆలోచన .. మేనమాము రావటంతో.. బాబు సభలోని అందరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ..కొడుక్కు లేని ప్రేమను మామగారు ప్రదర్శించారు. అభిమానం ఉంటే గుండెల్లో దాచుకోవాలి కానీ అనవసరం అని తెలిసి కూడా అవసరం లేనిచోట ప్రదర్శిస్తే నవ్వుల పాలుగాక మరేమవుతారు. మేనమామ గుండెల నిండా మా అమ్మ నాన్నలు ఉన్నారని జగన్ దగ్గర మార్కులు కొట్టేసాడు. కానీ అందరి ముందు జగన్ పార్టీ పరువు తీశాడు. ఏకకాలంలో రెండు పనులు జరగటం అంటే ఇదే. ఇలాంటి వారితో జగన్ ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు ఎలా నెట్టుకొస్తాడో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles