Kcr congratulations to speaker madhusudana chunri

kcr congratulations to speaker, cm kcr congratulations to speaker madhusudana chunri, Sirikonda Madhusudhana Chary, Bhupalpalle TRS MLA ,Telangana Speaker.

kcr congratulations to speaker madhusudana chunri, Bhupalpalle TRS MLA Sirikonda Madhusudhana Chary

స్పీకర్ అజాత శత్రువు-కేసిఆర్ పొగడ్తలు

Posted: 06/10/2014 01:13 PM IST
Kcr congratulations to speaker madhusudana chunri

శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన మధుసూదనాచారికి సీఎం కేసీఆర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సభలో కేసీఆర్ మాటలు.. ఈ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. తెలంగాణ చరిత్రలో ఇది చారిత్రక ఘట్టం. పట్టుదలకు మారుపేరు మధుసూదనాచారి.

తెలంగాణ ఉద్యమంలో చారి సేవలు మరువలేనివి. 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసుకుని సభ కొలువుదీరింది. ఇదే సభలో జై తెలంగాణ అన్న పదం నిషేధించిన సంఘటన నేను మర్చిపోలేను. ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా సభ కొనసాగాలి.

ఈ సభను చూస్తుంటే నాకు ఆనంద భాష్పాలు వస్తున్నాయి. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమకారులే సభను నడపడం సంతోషంగా ఉంది. దేశంలోనే తెలంగాణ శాసనసభకు గొప్ప పేరు తేవాలని చెబుతూ ప్రసంగాన్ని ముగించారు.

స్పీకర్ అజాత శ్రతువు

తెలంగాణ తొలి స్పీకర్‌గా ఎన్నికైన మధుసూదనాచారి అజాత శత్రువని డిప్యూటీ సీఎం రాజయ్య వ్యాఖ్యానించారు. రెండవ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మంచి నాయకుడిని స్పీకర్‌గా ఎన్నుకోవడం గర్వకారణమని తెలిపారు.

బంగారు తెలంగాణను సాధించాలనే లక్ష్యంగా ప్రతిపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సాధించుకున్న తెలంగాణను పాలించుకోబోతున్నమని హర్షం వ్యక్తం చేశారు. శాసన సభ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసేలా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles