Arrangements for chandrababu oath taking ceremony

Arrangements for Chandrababu oath taking ceremony, Chandrababu Oath taking in front of ANU Guntur, Elected MP Galla Jayadev TDP

Arrangements for Chandrababu oath taking ceremony

బాబు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చకచకా...

Posted: 06/02/2014 06:01 PM IST
Arrangements for chandrababu oath taking ceremony

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా జూన్ 8న జరిగే చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.  

ఈ ఏర్పాట్లను ఎంపీగా ఎన్నికైన గల్లా జయదేవ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.  ముందుగా జయదేవ్ చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే స్థలాన్ని ఇతర తెదేపా నేతలతో కలిసి పరిశీలించారు.  

chandrababu-oath-taking

ఈ స్థలం మొత్తాన్ని భద్రతా దళాలు తమ స్వాధీనంలోకి తీసుకుని భద్రతా ఏర్పాట్ల విషయంలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.  తెదేపా నాయకులు, అధికారులు జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్నారు.  

నేలను చదును చెయ్యటం దగ్గర్నుంచి తాత్కాలిక నిర్మాణాలు బారికేడ్లు అమర్చటం వరకు ప్రణాళిక ప్రకారం పనులు సాగుతున్నాయి.  గడువు లోపులో పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయని అధికారులు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles