Traffic jam at gandipeta due to mahanadu program

Traffic jam at Gandipeta Mahanadu, TDP Mahanadu second day heavy traffic, TDP success in elections Mahanadu

Traffic jam at Gandipeta due to Mahanadu program

మహానాడు సందర్బంగా ట్రాఫిక్ దిగ్బంధం

Posted: 05/28/2014 09:15 AM IST
Traffic jam at gandipeta due to mahanadu program

రెండవరోజు మహానాడు, తెలుగు దేశం పార్టీ సంస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే తెదేపా మద్దతుదార్లతో హైద్రాబాద్ లో గండిపేటకు దారితీసే దార్లన్నీ వాహనాలతో కిటకిటలాడుతూ ట్రాఫికంతా స్థంబించిపోయి వుంది.  

మహానాడు ప్రాంగణానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేయవలసి వస్తోంది.  గండిపేటలో ట్రాఫిక్ నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేసారు.  చేవెళ్ళ నుంచి హైద్రాబాద్ వచ్చే వాహనాలను నిలిపివేసి, మహానాడుకి వెళ్ళే వాహనాలను చేవెళ్ళవైపు మళ్ళించటం జరిగింది. గండిపేటలో అయితే ట్రాఫిక్ స్థంబించేపోయింది.  చేవెళ్ళ హైద్రాబాద్ రహదారి మీద పది కిలోమీటర్ల మేర వాహనాలను నిలిపివేయటంతో అందులో చిక్కుకున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవాల్సిన విద్యార్థులు ట్రాఫిక్ ని వదిలిపెట్టమని కోరుతూ ఆందోళన చేస్తున్నారు.  

మహానాడు తెలుగు దేశం పార్టీకి పండుగ రోజు.  పైగా ఈసారి ఆంధ్రప్రదేశ్ తిరుగులేని విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చింది.  అందువలన తెదేపా నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా మహానాడులో పాల్గొంటున్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles