Nominations fining chapter is over in telangana

Nominations fining chapter is over in Telangana, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Nominations fining chapter is over in Telangana

తెలంగాణాలో పూర్తైన నామినేషన్ల పర్వం

Posted: 04/10/2014 09:14 AM IST
Nominations fining chapter is over in telangana

గందరగోళం, తర్జనభర్జనలు, పొత్తులు, సీట్ల కేటాయింపులలో నెలకొన్న నిరసనలు, రెబల్ నాయకుల పోటీలు, ఆఖరి రోజునే సీటు ఖరారవటంతో హడావిడి, అభ్యర్థుల మీద దాడులు, అధినాయకుల మీద అలకలు- వీటన్నిటి మధ్యా బుధవారం నామినేషన్ల పర్వం పూర్తైంది. 

దీంతో ఎవరు ఎవరితో ఎక్కడ తలపడుతున్నారన్నది స్పష్టమైంది.  ఇక మిగిలిందల్లా ఎవరి ప్రచారాలు వారు చేసుకోవటం.  ప్రచారాలలో తమ గురించి చెప్పుకునేదానికంటే అవతలివారి గురించి చేసే విమర్శలే ఎక్కువుంటాయనుకోండి.  అసెంబ్లీ బరిలో 3137 అభ్యర్థులు, పార్లమెంటు బరిలో 388 అభ్యర్థులు పోటీకి నిలిచారు.  ఈ రోజు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.  నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజైన శనివారం వరకు ఇందులో ఎంతమంది నిలబడతారన్నది తెలుస్తుంది. 

తెలుగు దేశం, భాజపా పొత్తు, కాంగ్రెస్ తెరాసల మధ్య పొత్తు లేకపోవటం, నాయకులు పార్టీలు మారటంతో సీట్ల అడ్జస్ట్ మెంట్లలో గందరగోళం, సీట్లు లభించక, లేదా కోరుకున్న చోట లభించక నాయకుల నిరసనలు, రెబల్ నాయకుల స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలు వెరసి విశాలాంధ్రలో చిట్టచివరి ఎన్నికలు రసవత్తరం అవటానికి అన్ని సంకేతాలూ కనిపిస్తున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles