Tdp is not respond to alliance with bjp

Tdp, Bjp, 2014 election, alliance, TDP-BJP Alliance, chandra babu, Andhra Pradesh BJP, Telugu Desam.

tdp is not respond to alliance with bjp

సైకిల్ -కమలం 'పొత్తుల' చర్చలు విఫలం..

Posted: 03/29/2014 08:23 PM IST
Tdp is not respond to alliance with bjp

ఎన్నికల పొత్తులకు సంబంధించి బిజెపి, టిడిపి మధ్య నగరంలోని తాజ్ కృష్ణలో ఈరోజు  జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. ఇరుపార్టీలు సీట్లపై పట్టు వీడకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. ఒంటరిగా పోటీ చేయడానికి బిజెపి సిద్ధమైంది. 

తెలంగాణలో బిజెపి 10ఎంపి, 60 ఎమ్మెల్యే స్థానాలను అడగ్గా, ఏడు ఎంపి, 40 ఎమ్మెల్యే స్థానాలను ఇస్తామని టిడిపి చెప్పినట్లు సమాచారం. సీమాంధ్రలో 25 ఎమ్మెల్యే, 6 ఎంపీ స్థానాలను కోరినట్లు తెలుస్తోంది. రెండు పార్టీల మధ్య సమోద్య కుదరలేదు. 

ఈ నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. తెలంగాణ బిజెపి కమిటీ 119 మంది అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది. తెలంగాణ బిజెపి ఎన్నికల కమిటీ అధికారికంగా ప్రటించనుంది. అయితే టిడిపి పొత్తుల విషయంలో కిషన్ రెడ్డి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే బిజెపి కేంద్ర నాయకత్వం మాత్రం టిడిపి, బిజెపిల మధ్య ఎన్నికల పొత్తులు ఉండాలని భావిస్తుంది.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles