తెరాస విలీనం కానీ పొత్తుకు కానీ రాజీపడుతుందని ఇన్నాళ్లూ ఎదురుచూసిన కాంగ్రెస్ నేతలు తెరాస మీద ఎదురుదాడికి దిగారు. ఆదివారం గాంధీ భవన్ లో మాట్లడిన కాంగ్రెస్ నేతలు అధికారం తెరాస కు వస్తే ఆ పార్టీ నిర్మించేది గడీల తెలంగాణాయేనని తెలంగాణా వోటర్లను హెచ్చరించారు. అసలు విలీనం చెయ్యమని తాము అడగలేదని, పొత్తు కోసం తాము వెంపర్లాడటం లేదన్న విషయాన్ని స్పష్టం చేసిన కాంగ్రెస్ నాయకులు తెరాస తమకు ప్రత్యర్థే కాదని తెలుగు దేశం మాత్రమే ప్రత్యర్థని అంటూనే, దగా మోసం వంచనలకు మారుపేరు టిఆర్ఎస్ అని, సోనియా సగం కడుపు కోసుకుని తెలంగాణా ఇచ్చారు అని బాధపడ్డారు. అంటే రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని పోగొట్టుకున్నారన్న విషయాన్ని తేటతెల్లంగా తెలియజేసారు.
కాంగ్రెస్ తో పొత్తులు కాదు కత్తులే అంటూ తెరాస చేసిన ప్రకటనకు తెలంగాణా కాంగ్రెస్ కమిటీ వైస్ ఛైర్మన్ షబ్బీర్ అలీ, పార్టీ నాయకులు బస్వరాజ్ సారయ్య, పి.సుధాకర రెడ్డి ఆదివారం నాడు గాంధీ భవన్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్న మాటలవి.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నవ తెలంగాణా నిర్మాణం జరుగుతుందని, నమ్మకం, విశ్వాసం, అమాయకత్వాలకు పర్యాయపదాలైన తెలంగాణా ప్రజలు కాంగ్రెస్ మీద విశ్వాసం ఉంచి వోటేస్తారన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ.
రాష్ట్ర విభజనలో తనని పిలిచి మాట్లాడలేదని కెసిఆర్ అంగీకరించారని, జీవితంలో ఆయన మాట్లాడిన మొదటి సత్యం అదేనని అన్నారు షబ్బీర్ అలీ. అంటే తెలంగాణా విషయంలో చేసిందంతా కాంగ్రెస్ అన్న అర్థాన్ని స్ఫురించేట్టుగా మాట్లాడారాయన. వి హనుమంతరావు, దమ్ము చూపిస్తాం అని సవాల్ కూడా చేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more