Modi contests from where

Modi contests from where, BJP Poll meet, Modi contesting from UP, Modi contests from Lucknow or Varanasi, Murali Manohar Joshi, Rajnath Singh from Lucknow

Modi contests from where, Modi contesting from UP, Modi contests from Lucknow or Varanasi

మోదీ పోటీ ఎక్కడి నుంచి?

Posted: 03/13/2014 09:48 AM IST
Modi contests from where

ఈరోజు జరిగే పోల్ మీట్ లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలన్నది నిర్ణయించటం జరుగుతుంది.  ఉత్తర్ ప్రదేశ్ నుంచి పోటీ చెయ్యాలని నిర్ణయం ముందే జరిగింది కానీ ఉత్తర్ ప్రదేశ్ లో ఎక్కడినుంచన్నది నిర్ణయించటం మిగిలిపోయింది.  ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసి ఆరు నెలలైనా, ఇంత వరకు మోదీ పోటీ చెయ్యాల్సిన స్థల నిర్ణయం జరగకపోవటంతో అందుకు తగ్గ ఏర్పాట్లను చెయ్యటంలోనూ ప్రణాళికలను సిద్ధం చెయ్యటంలోను జాప్యం జరిగే అవకాశం ఉండటం వలన ఈరోజు ఆ విషయంలో పార్టీ నిర్ణయం తీసుకోవటానికి నిశ్చయించుకుంది.

ఉత్తర్ ప్రదేశ్ లో వారణాసి కాని లక్నో కాని మోదీకి పార్టీ సూచించే అవకాశం ఉంది.  మోదీ వారణాసిని కోరుకుంటున్నా, మురళీ మనోహర్ జోషికి వారణాసితో ఉన్న అనుబంధం వలన పార్టీలో వ్యతిరేకత వస్తోంది.  అందిన సమాచారం ప్రకారం భాజపా ఉత్తర్ ప్రదేశ్ లో ఆ రెండిటిలో ఒక నియోజకవర్గంతో పాటుగా ముఖ్యమంత్రిగా ప్రాభవం ఉన్న గుజరాత్ రాష్ట్రంలో కూడా పోటీ చెయ్యమని సూచించవచ్చు. 

మోదీ మొగ్గు వారణాసి వైపు ఉన్నా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఆయన ఏది సూచించినా అంగీకరిస్తారు.  ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లో ఎంపీ లజ్జీ టండన్, ఒకవేళ మోదీ అక్కడి నుండి పోటీ చేస్తే తాను అక్కడి నుండి పోటీకి నామినేషన్ వెయ్యనని ప్రకటించటం కూడా జరిగింది. 

మరో సమస్య ఏమిటంటే, పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ప్రస్తుతం తన నియోజకవర్గం ఘాజియాబాద్ ని వదిలిపెట్టి లక్నోకి మారదలచుకున్నారు. 

ఏది ఏమైనా ఈరోజు ఉత్తర్ ప్రదేశ్ లో అభ్యర్థుల పేర్లు ఖరారవుతాయి, అందులో మోదీ ఎక్కడి నుండి పోటీ చెయ్యాలన్నది నిర్ణయమవుతుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles