Congress collided with ysrcp and trs complains lagadapati

Congress collided with YSRCP and TRS complains Lagadapati, Lagadapati Rajagopal, TRS President KCR, YSRCP President Jaganmohan Reddy

Congress collided with YSRCP and TRS complains Lagadapati

జగన్ కెసిఆర్ లతో కాంగ్రెస్ కుమ్మక్కు- లగడపాటి

Posted: 02/04/2014 03:56 PM IST
Congress collided with ysrcp and trs complains lagadapati

విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఈ రోజు ఢిల్లీలో మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. 

పేరు చెప్పలేదు కానీ కాంగ్రెస్ కి చెందిన ఒక ముఖ్యనేత కెసిఆర్ ని  హోటల్లో కలిసారని, అధిష్టానమేమో జగన్ తో ఫోన్లో మాట్లాడటం జరిగిందని లగడపాటి దీనితో కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీలతో కుమ్మక్కై తెరాస అభ్యర్థికి రాజ్యసభ సీటు దక్కేలా పావులు కదుపుతోందని ఆరోపించారు.  ఈ సందర్భంగా ఆయన జగన్ ని కాంగ్రెస్ దత్తపుత్రుడని, అధిష్టానానికి అతనే ఎక్కువైపోయాడని వ్యాఖ్యానించారు. 

జాతీయ కాంగ్రెస్ పార్టీ మీద ధ్వజమెత్తుతూ లగడపాటి మైనారిటీలో పడ్డ ఆ పార్టీకి ఒక్కరోజు కూడా పార్లమెంటుని నడిపే సామర్థ్యం లేదని, ఢిల్లీలో తెలుగువాడి సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు.

రాష్ట్ర విభజన బిల్లుని అడ్డుకోవటానికి మార్గాలెన్నో ఉన్నాయన్న లగడపాటి, ఇతర పార్టీ నాయకులతో కూడా మాట్లాడటం జరిగిందని, బిల్లు వీగిపోవటమే కాదు, అసలు పార్లమెంటులో ఎందుకు ప్రవేశపెట్టామా అని తలలు పట్టుకునే స్థితి అధిష్టానానికి కలుగుతుందని లగడపాటి అన్నారు. 

లగడపాటి రాజగోపాల్ తన సొంత పార్టీయైన కాంగ్రెస్ నే కాకుండా తెదేపా, వైకాపా లను కూడా విభజన విషయంలో తప్పులు చేసారని విమర్శించారు.  అయితే ఇప్పటికైనా పార్టీలను మర్చిపోయి సమిష్టిగా పోరాడితే రాష్ట్ర విభజన జరగకుండా ఆపవచ్చని ఆయన అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles