Apngos employees strike from february 6th

AP NGO, Bifurcation, ashok babu, seemandhra, Seemandhra employees,strike,February 6th,samaikyandhra,APNGO

APNGO employees strike from february 6th. Seemandhra employees,strike,February 6th, samaikyandhra,APNGO

మళ్ళీ సమ్మెకు దిగుతున్న ఎపీ ఎన్జీఓలు

Posted: 02/03/2014 07:36 PM IST
Apngos employees strike from february 6th

తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో వాదోప వాదాలు, తిరస్కరణ మధ్య చర్చించి ఇచ్చిన గడువు పూర్తి కావడంతో నేడు బిల్లును కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. ఇక రేపటి నుండి ప్రారంభం అయ్యే పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టడం ఖాయంగా కనిపిస్తుండంతో మన రాష్ట్రంలో ఏపీ ఎన్జీఓలు మళ్ళీ సమ్మె సైరన్ మోగించారు.

గతంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సుదీర్ఘ కాలం పాటు సమ్మె చేసిన ఏపీ ఎన్జీఓలు ఈనెల 7 నుండి మళ్లీ సమ్మెలో పాల్గొన బోతున్నారు. ఈనెల 7,8,9 వ తేదీల్లో కేంద్ర మంత్రుల నివాసాలను, 10,11,12 తేదీల్లో రాష్ట్ర బంద్ కి, 17,18,19 తేదీలో ఛలో ఢిల్లీ కార్యక్రమాలు చేపట్టాలని నేడు ఏపీఎన్జీఓ భవన్ లో జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో నిర్ణయించారు. అయితే ఏపీ ఎన్జీఓలు మళ్ళీ సమ్మె బాట పట్టడం చూస్తుంటే తెలంగాణ ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles